Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

ABN , First Publish Date - 2023-03-24T18:19:32+05:30 IST

డాన్స్ వీడియోలంటేనే జనం బాగా చూస్తుంటారు. అందులో మహిళలు డాన్స్ చేసిన వీడియోలైతే.. ఇక ఎంత వైరల్ అవుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహ కార్యక్రమాల్లో ఇటీవల వధువులతో పాటూ మహిళలు వేస్తున్న డాన్స్ వీడియోలు..

Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

డాన్స్ వీడియోలంటేనే జనం బాగా చూస్తుంటారు. అందులో మహిళలు డాన్స్ చేసిన వీడియోలైతే.. ఇక ఎంత వైరల్ అవుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహ కార్యక్రమాల్లో ఇటీవల వధువులతో పాటూ మహిళలు వేస్తున్న డాన్స్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ మహిళ మీద మీద పడుతూ వేసిన డాన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం డాన్స్‌రా నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఓ మహిళ డాన్స్ వీడియో తెగ వైరల్ (Women Viral videos) అవుతోంది. రాత్రి వేళలో జరిగిన ఓ కార్యక్రమంలో హార్మోనియం, డోలు, డప్పుల మోత మొదలవుతుంది. అక్కడే ఓ మహిళ మైకు పట్టుకుని నిలుబడి ఉంటుంది. అంత వరకూ బాగానే ఉన్న ఆమె.. పాట మొదలవగానే పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. వెంటనే ఒక్క ఉదుటున స్టేప్పు వేస్తూ.. మోకాళ్లపై జారుతూ అక్కడే కూర్చున్న ఉన్న వాళ్ల మీదకు జారుకుంటూ వస్తుంది. మళ్లీ పైకి లేచి అదే విధంగా మోకాళ్లపై జారుకుంటూ ఓ వ్యక్తిపైకి దూసుకెళ్తుంది.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

ఈమె డాన్స్ చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయపడిపోతారు. ఇదేం డాన్స్ రా నాయనా.. అంటూ అంతా గుసగుసలాడుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈమె డాన్స్ (Women dance videos) చూస్తుంటే.. అక్కడ భూకంపం వచ్చుండాలే.. అని కొందరు, ఇది డాన్స్ మమ్మల్ని చాలా భయపెట్టింది.. అంటూ మరికొందరు, ఈ డాన్స్ చాలా ఫన్నీగా ఉందే.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో వ్యూస్‌ను, లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..

Updated Date - 2023-03-24T18:19:32+05:30 IST