తలుపు వద్ద సీన్ చూడగానే అటకెక్కిన కుటుంబం.. గంటల తరబడి పైనే ఉండడంతో.. చుట్టు పక్కల వారు వచ్చి చూడగా..

ABN , First Publish Date - 2023-03-24T17:11:59+05:30 IST

కొన్నిసార్లు చోటు చేసుకునే అనూహ్య ఘటనలు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటాం. ఊహించని స్థలాల్లో ఊహించని విధంగా అనుమానాస్పద వస్తువులో లేక జంతువులో ప్రత్యక్షమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ...

తలుపు వద్ద సీన్ చూడగానే అటకెక్కిన కుటుంబం.. గంటల తరబడి పైనే ఉండడంతో.. చుట్టు పక్కల వారు వచ్చి చూడగా..

కొన్నిసార్లు చోటు చేసుకునే అనూహ్య ఘటనలు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటాం. ఊహించని స్థలాల్లో ఊహించని విధంగా అనుమానాస్పద వస్తువులో లేక జంతువులో ప్రత్యక్షమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మారుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట వైరల్‌గా మారింది. తలుపు వద్ద సీన్ చూగానే ఓ కుటుంబం భయభ్రాంతులకు గురైంది. గంటల తరబడి అటక మీదే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కోర్బా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి వింత సమస్య వచ్చి పడింది. ఇటీవల ఓ రోజు సదరు కుటుంబంలోని ఓ వ్యక్తి తలుపు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో గడప వద్ద ఓ నాగు పాము (Cobra) బుసలు కొడుతూ పైకి లేచింది. దీంతో ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు మొత్తం ఇంట్లోని అల్మారా బండపై కూర్చున్నారు. అయితే ఎంత సేపు చూసినా ఆ పాము అక్కడి నుంచి వెళ్లలేదు.

Beggar: ఓ బిచ్చగాడి సంచిలో ఆధార్‌కార్డు.. అతడెవరో ఆరా తీసి అవాక్కైన పోలీసులు.. మాస్టర్ డిగ్రీ చదివి కూడా ఎందుకిలా పిచ్చోడయ్యాడో తెలిసి..

snake-trending-videos.jpg

పడగ విప్పి అలాగే వారినే చూస్తుండడంతో వారు మరింత భయపడిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు అక్కడే కూర్చున్నారు. తర్వాత చుట్టుపక్కల వారికి ఫోన్ చేయడంతో అక్కడికి వచ్చి చూసి అంతా అవాక్కయ్యారు. చివరకు స్నేక్ క్యాచర్‍‌కు (Snake Catcher) ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్‍.. పామను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పాముకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral videos) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

Updated Date - 2023-03-24T17:16:57+05:30 IST