Banana Viral Video: ఒకే ఒక్క అరటిపండు కదా.. ఈజీగా తినేస్తామని అనుకుంటున్నారేమో.. దీన్ని తినడం అంత ఈజీ కాదండోయ్..!

ABN , First Publish Date - 2023-03-23T20:39:57+05:30 IST

అరటి పండు తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా మీ వద్దకు వచ్చి.. అరటి పండు తినగలవా.. అని అడిగితే.. ‘‘అదేమన్నా పెద్ద పనా, చటుక్కున తొక్క వొలిచేసి, లటుక్కున్న లాగించేస్తాం’’.. అని అంటారు కదా. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే..

Banana Viral Video: ఒకే ఒక్క అరటిపండు కదా.. ఈజీగా తినేస్తామని అనుకుంటున్నారేమో.. దీన్ని తినడం అంత ఈజీ కాదండోయ్..!

అరటి పండు తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా మీ వద్దకు వచ్చి.. అరటి పండు తినగలవా.. అని అడిగితే.. ‘‘అదేమన్నా పెద్ద పనా, చటుక్కున తొక్క వొలిచేసి, లటుక్కున్న లాగించేస్తాం’’.. అని అంటారు కదా. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే అరటి పండును మీ చేతికి ఇచ్చినా.. అదే సమాధానం చెబుతాం అంటే.. ఇక మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకే ఒక్క అరటి పండు తినడానికి ఇంతగా ఆలోచించాలా అని అనుకుంటారేమే.. కానీ దీన్ని తినడం మాత్రం అంత ఈజీ కాదండోయ్..!. ఇంతకీ ఈ అరటి పండు ఎక్కడ ఉందీ.. ఏంటి దీని స్పెషల్.. తదితర వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోనే అతి పెద్ద అరటి పండును చూడాలంటే.. ఇండోనేషియాలోని (Indonesia) పాపువా న్యూగినియా ద్వీపానికి వెళ్లాల్సిందే. ఇక్కడి దీవిలో అరటి చెట్టు సాధారణ చెట్టులా కాకుండా కొబ్బరిచెట్టులా (coconut tree) పొడుగ్గా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఈ చెట్టుకు కాసే కాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. అరచేతి నుంచి మోచేయి పొడవు ఉండే ఈ అరటికాయలు.. ఒక్కోటి సుమారు 3కిలోల బరువు ఉంటాయి. దీంతో ఈ అరటి పండ్ల (Bananas) గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ అరటి పండుకు సంబంధించిన ఓ వీడియో (Viral videos) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

ఓ యువకుడు, యువతి (young woman and young man) అరటి పండును చూసి షాక్ అవుతారు. యువతి అయితే వామ్మో! ఈ అరటి పండును తినడం నావల్ల కాదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. మరో యువకుడు వావ్! టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని చెబుతాడు. కానీ పండును మొత్తం తినడంలో మాత్రం అంతా ఫెయిల్ అవుతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇలాంటి అరటి పండ్లు మేమెక్కడా చూల్లేదు బాబోయ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

Updated Date - 2023-03-23T20:39:57+05:30 IST