Viral Video: స్కూటీని ఇలా స్టార్ట్ చేస్తున్నారా... అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

ABN , First Publish Date - 2023-03-22T17:55:37+05:30 IST

అనూహ్య ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీలో..

Viral Video: స్కూటీని ఇలా స్టార్ట్ చేస్తున్నారా... అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

అనూహ్య ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీలో పెట్రోల్ బంక్‪‌కు వెళ్లాడు. పెట్రోల్ పట్టించుకున్న అనంతరం బండి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో పలుమార్లు కాలితో కిక్ కొడతాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దంతెవాడ జిల్లా బర్సూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటీలో (Scooty) స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు (Petrol Bunk) వచ్చాడు. పెట్రోల్ పట్టించుకున్న అనంతరం బండిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే బండి ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో కిందకు దిగి.. ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని, కాలితో కిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయినా బండి మాత్రం స్టార్ట్ కాదు. ఇలా పదే పదే ప్రయత్నించడంతో ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. అయితే ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్తుంది.

Viral Video: మహిళకు ఆపరేషన్ చేస్తుండగా సడన్‌గా కంపించిన కంప్యూటర్లు.. ఒక్కసారిగా చీకటి ఆవరించడంతో చివరకు ఏం జరిగిందంటే..

స్కూటీని నియంత్రించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎలాగైనా ఆపాలని స్కూటీ వెంటే పరుగెత్తుకుంటూ వెళ్తాడు. వేగంగా ముందుకు వెళ్లిన స్కూటీ.. ఎదురుగా ఉన్న ఏటీఎంలోకి (ATM Room) దూసుకెళ్తుంది. అద్దాలు పగులగొట్టుకుని లోపలికి వెళ్లి ఆగిపోతుంది. అయితే ఆ సమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో (CC cameras) రికార్డు అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

Updated Date - 2023-03-22T17:55:37+05:30 IST