అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

ABN , First Publish Date - 2023-03-21T19:59:38+05:30 IST

ఆమె ఓ హిజ్రా. స్టేజ్ షోలు నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఓ యువకుడు హిజ్రా ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. చివరకు ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్లి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇందుకు..

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

ఆమె ఓ హిజ్రా. స్టేజ్ షోలు నిర్వహిస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఓ యువకుడు హిజ్రా ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. చివరకు ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్లి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇందుకు నిరాకరించిన సదరు హిజ్రా.. అసలు నిజం ఏంటో చెప్పింది. అయినా ఆమెనే వివాహం చేసుకున్న యువకుడు.. సరిగ్గా ఆరు నెలల తర్వాత ఏం చేశాడంటే..

బీహార్ ముజఫర్‌పూర్ (Bihar Muzaffarpur) బోచాహా పోలీస్ స్టేషన్‌ పరిధి రాంపూర్ జైపాల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఏ పనీ చేయకుండా స్థానికంగా జులాయిగా తిరుగుతుండేవాడు. ఇటీవల అతడు ఇదే ప్రాంతంలో నిర్వహించిన స్టేజ్ షోకి (Stage shows) వెళ్లాడు. అక్కడ స్టేజిపై ఓ 19 ఏళ్ల హిజ్రా (Hijra) ప్రదర్శనకు ఫిదా అయ్యాడు. కార్యక్రమం అనంతరం హిజ్రా వద్దకు వెళ్లి.. ‘‘మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా’’.. అని చెప్పాడు. దీంతో ముందుగా హిజ్రా ఇందుకు అభ్యంతరం తెలియజేసింది. ‘‘నేను ఒక హిజ్రాను.. నన్ను పెళ్లి చేసుకున్నా.. నీకు పిల్లల్ని కనిపెట్టలేను.. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు’’.. అని సలహా ఇచ్చింది. అయినా సదరు యువకుడు మాత్రం ఆమెను రోజూ వెంబడిస్తూ ఉండేవాడు.

Super Splendor: ఏ బైక్‌కు అయినా రెండే కదా.. దీనికేంటి మూడు టైర్లున్నాయని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడు దీన్నెలా మార్చేశాడో మీరే చూడండి..!

ఇలా రోజూ తన చుట్టే తిరుగుతుండడంతో చివరకు హిజ్రా కూడా పెళ్లికి అంగీకరించింది. ఎట్టకేలకు ఆమెను పెళ్లి చేసుకున్న (Marriage with Hijra) యువకుడు.. తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తన భార్య స్టేజ్ షోల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం తీసుకునేవాడు. ఈ మొత్తంతో కొత్త ఇంటిని నిర్మించడంతో పాటూ తన అన్నకు వివాహం కూడా చేశారు. వివాహమైన ఆరు నెలల తర్వాత నుంచి భార్యను వేధించడం (Harassment) మొదలెట్టాడు. అయినా ఆమె ఓపిగ్గా భరిస్తూ వచ్చింది. అయితే అంతటితో ఆగన యువకుడు.. ‘‘నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో’’.. అంటూ బయటికి గెంటేశాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Wife: ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-03-21T19:59:38+05:30 IST