Viral Video: ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోంచి జూమ్ చేసి మరీ వీడియోను తీసి..

ABN , First Publish Date - 2023-03-18T19:19:57+05:30 IST

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అంటారు. అలాంటిది మనుషులు స్పందించరా అంటే అవును అనే సమాధానం వస్తుంది. మనసుకు హత్తుకునే పాట వినిపించగానే మనకు తెలీకుండానే మనసు స్పందిస్తుంది. ఈ క్రమంలో చేతులు, కాళ్లు ఆటోమేటిక్‌గా షేక్ అవడం సాధారణంగానే...

Viral Video: ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోంచి జూమ్ చేసి మరీ వీడియోను తీసి..

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయని అంటారు. అలాంటిది మనుషులు స్పందించరా అంటే అవును అనే సమాధానం వస్తుంది. మనసుకు హత్తుకునే పాట వినిపించగానే మనకు తెలీకుండానే మనసు స్పందిస్తుంది. ఈ క్రమంలో చేతులు, కాళ్లు ఆటోమేటిక్‌గా షేక్ అవడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. కొందరైతే డాన్స్ రాకున్నా.. వచ్చీరాని స్టెప్పులు వేసి, వారి కోరికను తీర్చుకుంటుంటారు. ఇంకొందరు అందరి ముందూ డాన్సులు వేయలేక.. నాలుగు గోడల మధ్యలో గెంతులు వేసి మరీ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అపార్ట్మెంట్‌లోని భార్యాభర్తలు ఆనందంగా డాన్స్ (Couple dance) వేస్తుంటారు. పక్కనే ఉన్న బిల్డింగ్‌లోని వారు గమనించి, చివరకు ఏం చేశారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ అపార్ట్మెంట్‌ వద్ద వివాహానికి సంబంధించిన పార్టీ జరుగుతుంటుంది. ఈ సందర్భంగా అక్కడ డీజే పాటలకు (DJ songs) యువత డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ‘‘ధోల్ జారీరో దా’’ అనే హిందీ పాట (Hindi songs) ప్లే అవుతుంది. దీంతో యువత మరింత ఉత్సాహంగా సందడి చేస్తుంటారు. ఈ పాట వారికే కాకుండా పక్కన ఉండే అపార్ట్మెంట్‌‌లోని ఓ జంటకూ తెగ నచ్చేస్తుంది. ఇంకేముందీ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంట్లోనే డాన్సులు వేయడం స్టార్ట్ చేస్తారు. పాటకు తగ్గట్టుగా లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రియురాలి ఛాతిపై తన పేరును రాసి మరీ కండీషన్ పెట్టాడు.. కొన్నాళ్ల తర్వాత బాలిక తండ్రి తన సూట్ కేస్ తెరవడంతో..

పార్టీ జరుగుతున్న అపార్ట్మెంట్‌ పైన ఉన్న ఓ వ్యక్తి.. దీన్నంతా గమనిస్తూ ఉంటాడు. దంపతుల డాన్స్‌ను తన కెమెరాలో (Camera) బంధిస్తాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ జంట జీవితమంతా ఇలాగే ఆనందంగా ఉండాలి.. అని కొందరు, పెళ్లికి వెళ్లకపోయినా ఇలాక్కూడా ఎంజాయ్ చేయొచ్చు అని తెలిసింది... అని ఇంకొందరు, అనుమతి లేకుండా ఇలా ఇంకొకరిని వీడియో తీయడం సరికాదు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! వీడేంటీ.. విషసర్పాలను ఇలా ఏరిపారేస్తున్నాడు.. నడి రోడ్డుపై ఇతడు చేసిన పని చూస్తే..

Updated Date - 2023-03-18T19:19:57+05:30 IST