Viral Video: నిటారుగా ఉండే కొండపై దెయ్యాలు పరుగు పెడుతున్నట్లు అనుమానం.. చివరకు కెమెరాను జూమ్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2023-03-17T20:49:07+05:30 IST

దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే విషయం పక్కన పెడితే, కొన్నిసార్లు వైరల్ అయ్యే వీడియోల్లో కనిపించే ఆకారాలు దెయ్యాల తరహాలో ఉంటాయి. అయితే చివరికి ఆరా తీస్తే.. అది ఏ చెట్టో, పుట్టో లేదా ఏదో జంతువును చూసో అలా భ్రమ పడ్డామని తేలిపోతుంది. ఈ విషయం పక్కన పెడితే..

Viral Video: నిటారుగా ఉండే కొండపై దెయ్యాలు పరుగు పెడుతున్నట్లు అనుమానం.. చివరకు కెమెరాను జూమ్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..

దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే విషయం పక్కన పెడితే, కొన్నిసార్లు వైరల్ అయ్యే వీడియోల్లో కనిపించే ఆకారాలు దెయ్యాల తరహాలో ఉంటాయి. అయితే చివరికి ఆరా తీస్తే.. అది ఏ చెట్టో, పుట్టో లేదా ఏదో జంతువును చూసో అలా భ్రమ పడ్డామని తేలిపోతుంది. ఈ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి నిటారుగా ఉండే కొండను తన కెమెరాలో బంధిస్తుంటాడు. ఆ సమయంలో దూరంగా ఏవో దెయ్యాలు పరుగులు పెడుతున్నట్లు కనిపించింది. దీంతో చివరకు కెమెరాలను జూమ్ చేసి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. లడఖ్‌లోని (Ladakh) ఉరియాల్ సమీపంలోని మంచు పర్వతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ప్రకృతి ప్రేమికులు తన కెమెరాలో ఓ ఎత్తైన, నిటారుగా ఉండే కొండను వీడియో తీస్తుంటారు. ఆ సమయంలో కొండపై దూరంగా ఏవో దెయ్యాలు (ghosts) పరుగులు పెడుతున్నట్లు అనుమానం కలుగుతుంది. ఏంటబ్బా అని అనుమానం వచ్చి.. చివరకి వారి కెమెరాలను (Camera) జూమ్ చేసి చూస్తారు. జూమ్ చేసే కొద్దీ.. కొన్ని జంతువులు పరుగెత్తుతున్నట్లు అర్థమవుతుంది. అవేంటో తెలుసుకుందామని మరింత జూమ్ చేస్తారు. చివరకు మూడు జంతువులను ఓ మంచు చిరుత వేటాడుతున్నట్లు కనిపిస్తుంది.

Viral Video: రైల్లో డాన్స్‌ను ఇరగదీసిన యువతి.. కానీ ‘అప్పర్ బెర్త్‌’పై పడుకున్న ఈ కుర్రాడి గురించే నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

నిటారుగా ఉన్న కొండ మధ్యలో మూడు జంతువులు మేత మేస్తూ ఉంటాయి. ఆ సమయంలో వాటిని మంచు చిరుత (cheetah) గమనిస్తుంది. వెంటనే వాటిపై దాడికి దిగుతుంది. చిరుతను గమనించిన జంతువుల తలో దిక్కుకు పారిపోతాయి. వాటిలో ఓ జంతువును టార్గెట్ చేసిన పులి.. కొండ కింద భాగం వరకూ అత్యంత వేగంగా వెంబడిస్తుంది. కొండ దిగువ భాగంలో ఎట్టకేలకు దాన్ని పట్టుకుంటుంది. చివరకు ఆ జంతువును నోట కరుచుకుని ఎత్తుకెళ్తుంది. ఈ మంచు చిరుతలకు అత్యంత వేగంగా వేటాడే జంతువులుగా పేరుంది. వీటిని అక్కడ ఘోస్ట్ ఆఫ్ ది మౌంటైన్ (Ghost Of The Mountain) అని పిలుస్తుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: వామ్మో! వీడేంటీ.. విషసర్పాలను ఇలా ఏరిపారేస్తున్నాడు.. నడి రోడ్డుపై ఇతడు చేసిన పని చూస్తే..

Updated Date - 2023-03-17T20:49:07+05:30 IST