Viral Video: రైల్లో డాన్స్‌ను ఇరగదీసిన యువతి.. కానీ ‘అప్పర్ బెర్త్‌’పై పడుకున్న ఈ కుర్రాడి గురించే నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ABN , First Publish Date - 2023-03-16T20:17:34+05:30 IST

ఇటీవల యువకులతో పోటీపడుతూ యువతులు కూడా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఎలాంటి సిగ్గు, మొహమాటం లేకుండా యువతులు చేసే పనులు.. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇటీవల కొందరు యువతులు బహిరంగ ప్రదేశాల్లో..

Viral Video: రైల్లో డాన్స్‌ను ఇరగదీసిన యువతి.. కానీ ‘అప్పర్ బెర్త్‌’పై పడుకున్న ఈ కుర్రాడి గురించే నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ఇటీవల యువకులతో పోటీపడుతూ యువతులు కూడా రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఎలాంటి సిగ్గు, మొహమాటం లేకుండా యువతులు చేసే పనులు.. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇటీవల కొందరు యువతులు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ యువతి రైల్లో డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం యువతి డాన్స్ వేస్తుండగా.. అప్పర్ బెర్త్‌’పై పడుకున్న కుర్రాడి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యువతి డాన్స్‌కు సంబంధించిన వీడియో (Young women dance videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రద్దీగా ఉన్న రైల్లో (train) ఉన్నట్టుండి తనలోని డాన్సర్‌ని నిద్ర లేపుతుంది. పుష్ప సినిమాలోని (Pushpa movie) సామి సామి హిందీ పాటకు కాలు కదుపుతుంది. ఎంతో ఎనర్జీగా, ఎంతో ఉత్సాహంగా.. ఆమె వేసిన డాన్స్ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. దీంతో మహిళలు కూడా తదేకంగా చూస్తూ.. ఆమెను ప్రోత్సహించారు. మెలికలు తిరుగుతూ ఆమె వేసిన డాన్స్.. అందరినీ కట్టిపడేసింది. అక్కడే ఉన్న వారంతా ఆమెను వీడియో తీయడం మొదలెట్టారు.

Viral Photo: ఎవరీ అమ్మాయి..? అంటూ అదే పనిగా వెతికిన నెటిజన్లు.. ఒకే ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసిన యువతి..!

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి డాన్స్ వేస్తుండగా ‘అప్పర్ బెర్త్‌’పై (Upper Berth) ఎర్రటి టీషర్ట్ వేసుకుని పడుకున్న యువకుడి (young man) గురించి నెటిజన్లెు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎంతో ఇంట్రెస్ట్‌గా తన ఫోన్‌లో వీడియో తీసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వ్యక్తి యువతి డాన్స్‌కు ఫిదా అయినట్లు ఉన్నాడు.. అని కొందరు, ఆ సమయంలో అతను బాత్‌రూమ్ అర్జంట్ అయినా వెళ్లే పరిస్థితిలో లేడు.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Onion Peels: ఈ నిజాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును ఇకపై అస్సలు పడేయరు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు లాభాలు..!

Updated Date - 2023-03-16T20:17:34+05:30 IST