బాత్రూంలోనే భార్యాభర్తల మృతి కేసులో షాకింగ్ నిజాలు.. 9 రోజుల తర్వాత వీడిన మిస్టరీ.. ఇద్దరూ ఎలా చనిపోయారంటే..!

ABN , First Publish Date - 2023-03-16T18:36:13+05:30 IST

సంతోషంగా సాగుతున్న సమయాల్లో కొన్నిసార్లు.. షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారు.. అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇటీవల రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఉదయం నుంచి..

బాత్రూంలోనే భార్యాభర్తల మృతి కేసులో షాకింగ్ నిజాలు.. 9 రోజుల తర్వాత వీడిన మిస్టరీ.. ఇద్దరూ ఎలా చనిపోయారంటే..!

సంతోషంగా సాగుతున్న సమయాల్లో కొన్నిసార్లు.. షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో అప్పటిదాకా ఆనందంగా ఉన్న వారు.. అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇటీవల రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బంధువులతో హోలీ ఆడిన దంపతులు.. సాయంత్రం అనూహ్యంగా మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టించింది. భార్యాభర్తలు బాత్రూంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి 9 రోజుల తర్వాత మిస్టరీ వీడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) భిల్వారా జిల్లా షాపురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివనారాయణ్, కవిత దంపతులు (couple) .. 9ఏళ్ల కొడుకు బిహాన్‌తో కలిసి జీవనం సాగిస్తుంటారు. శివనారాయణ్ తాత బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ప్రెసిడెంట్‌గా (President of the Board of Trade) పని చేశారు. వీరిది మొదటి నుంచీ సంపన్న కుటుంబం కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ (Financial difficulties) లేవు. కొడుకుతో సంతోషంగా జీవిస్తున్న వీరి కుటుంబంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శీతలాష్టమి పండుగ సందర్భంగా స్థానికంగా హోలీ (Holly) ఆడటం సాంప్రదాయంగా వస్తోంది. దీంతో ఇటీవల పండుగ సందర్భంగా అంతా హోలీ ఆడారు. శివనారాయణ్ దంపతులు తమ కొడుకుతో పాటూ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సరదా సరదాగా హోలీ ఆడారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురూ బాత్‌రూమ్‌కి వెళ్లారు.

Funny viral video: ఎక్కడా స్థలం లేక డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ.. దిగమని కోరగా చివరకు ఆమె ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే..

Noida-couple-crime.jpg

అయితే ఐదు గంటలు అవుతున్నా వారు మాత్రం బయటికి రాలేదు. దీంతో వారి బంధువులకు అనుమానం వచ్చి బాత్‌రూమ్‌లో పరిశీలించగా.. ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శివనారాయణ్, కవిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారి కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న దంపతులు.. ఉన్నట్టుండి తిరిగిరాని లోకాలకు చేరుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. తొమ్మిది రోజుల అనంతరం వారి మృతికి గల కారణాలను పోలీసులు తెలియజేశారు బాత్‌రూమ్‌లోని గీజర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ (carbon dioxide) వెలువడడంతో ఊపిరాడక దంపతులు మృతి చెందినట్లు తెలిపారు.

Onion Peels: ఈ నిజాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును ఇకపై అస్సలు పడేయరు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు లాభాలు..!

Updated Date - 2023-03-16T18:36:13+05:30 IST