Viral Video: అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ.. ఎలా వేడుకుంటుందో చూడండి..

ABN , First Publish Date - 2023-03-15T15:39:47+05:30 IST

హిందువులు వానరాలను ఆంజనేయ స్వామికి ప్రతి రూపంగా ఆరాధిస్తుంటారు. ఎక్కడ కనిపించినా వాటిని అంతే భక్తితో ఆరాధిస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా కోతి చనిపోతే.. పూజలు చేసి, అంత్యక్రియలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటుంటారు. కోతులు కొన్నిసార్లు ..

Viral Video: అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ.. ఎలా వేడుకుంటుందో చూడండి..

హిందువులు వానరాలను ఆంజనేయ స్వామికి ప్రతి రూపంగా ఆరాధిస్తుంటారు. ఎక్కడ కనిపించినా వాటిని అంతే భక్తితో ఆరాధిస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా కోతి చనిపోతే.. పూజలు చేసి, అంత్యక్రియలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటుంటారు. కోతులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో పురాణాలు చెప్పేవి నిజమేమో అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రోజూ ఆర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించే కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ దేవుడిని భక్తితో వేడుకుంటోంది. చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

సోషల్ మీడియాలో కోతికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ (Monkey viral videos) అవుతోంది. ఈ ఘటన అయోధ్యలో (Ayodhya) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి అర్ధరాత్రి వేళ ఆలయానికి (temple) చేరుకుంటుంది. వచ్చే ముందు మధ్య మధ్యలో ఆగుతూ దేవుడికి దండాలు (Praying to God) పెడుతూ వస్తుంది. ఆలయ మెట్లు ఎక్కి లోపలికి వెళ్లే ముందు.. సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న కుక్క కోతిని గమనిస్తుంది.

Viral Video: లోయలో ఊయల ఊగుతున్న యువతులు.. యువకుడి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..

అయినా ఇవేవీ పట్టించుకోని కోతి.. లోపలికి వెళ్లి కొద్ది సేపు మౌనంగా కూర్చుంటుంది. కాసేపటి తర్వాత కుక్క (dog) అక్కడికి వచ్చి కోతిని చూసి గట్టిగా మొరుగుతుంది. అయినా భయపడని కోతి.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అన్నట్లుగా దాన్ని ప్రతిఘటిస్తుంది. దెబ్బకు కుక్క అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పక్కనే ఉన్న దేవుడి విగ్రహానికి ఎదురుగా చాలా సేపు సాష్టాంగ నమస్కారం చేస్తూ.. ఆశీర్వదించమని అడుగుతున్నట్లుగా దేవున్ని వేడుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: మొబైల్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడి వాలకం చూసి పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-03-15T15:43:03+05:30 IST