మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువకుడు.. సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా.. ‘‘నీ భార్యను నా వద్దకు పంపించు’’.. అని అడగడంతో..

ABN , First Publish Date - 2023-03-14T18:05:39+05:30 IST

వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో వారిలో ఓ యువకుడి బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు ఫుల్‌గా మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. సరదా సరదాగా మాట్లాడుతూనే ఉన్నట్టుండి..

మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువకుడు.. సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా.. ‘‘నీ భార్యను నా వద్దకు పంపించు’’.. అని అడగడంతో..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో వారిలో ఓ యువకుడి బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు ఫుల్‌గా మందు కొట్టి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. సరదా సరదాగా మాట్లాడుతూనే ఉన్నట్టుండి ‘‘నీ భార్యను నా వద్దకు పంపించు’’.. అని అనడంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..

కర్ణాటకలోని బెంగుళూరులో (Karnataka Bangalore) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సురేష్, మణికాంత్ అనే ఇద్దరు యువకులు (friends) స్నేహితులు. ఇలావుండగా, ఇటీవల మణికాంత్ తరచూ సురేష్ ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఇటీవల ఇద్దరూ తరచూ మద్యం సేవిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు మణికాంత్ ఫుల్‌గా మందు కొట్టి సురేష్ ఇంటికి వెళ్లాడు. స్నేహితుడే కావడంతో సురేష్ కూడా లోపలికి పిలిచి మర్యాదలు చేశాడు. ఇద్దరూ సరదగా మాట్లాడుకుంటూ ఉండగా షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మణికాంత్.. ఉన్నట్టుండి కామాంధుడిగా మారిపోయాడు. ‘‘నీ భార్యను నావద్దకు పంపించు’’.. అని సురేష్‌తో అన్నాడు.

Viral Video: పెళ్లిలో డాన్స్ వేస్తూ.. ఉన్నట్టుండీ ఈ వ్యక్తి చేసిన పనికి షాకైన పోలీస్.. చివరకు ఏమైందో మీరే చూడండి..

అప్పటికిదాకా బాగున్న మణికాంత్.. ఉన్నట్టుండి ఇలా అసభ్యకరంగా (Indecent behavior) మాట్లాడటంతో సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఓ కర్ర తీసుకుని, మణికాంత్‌పై విచక్షణా రహితంగా దాడి (attack) చేశాడు. ఈ దాడిలో మణికాంత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయమడంతో మణికాంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేష్ నేరం అంగీకరించడంతో పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణికాంత్ మృతితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పరిపక్వత లేదంటూ బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న యువతి.. చివరకు ఆమె చేసుకున్న వ్యక్తిని చూసి అంతా షాక్..

Updated Date - 2023-03-14T19:32:49+05:30 IST