Marriage Photos: అయ్యబాబోయ్.. ఇలాంటి బంధువులు ఉంటే ఇక పెళ్లిళ్లు అయినట్టే.. వరుడికే చిర్రెత్తుకొచ్చి పెళ్లిని ఆపేసినంత పనిచేశాడు..!

ABN , First Publish Date - 2023-03-10T18:21:58+05:30 IST

కొందరు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి, చివరికీ అందరినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇంకొందరైతే అంతటితో ఆగకుండా దాడులకు తెగబడుతుంటారు. వీరి కారణంగా అభం శుభం తెలియని అమాయకులు బలవుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

Marriage Photos: అయ్యబాబోయ్.. ఇలాంటి బంధువులు ఉంటే ఇక పెళ్లిళ్లు అయినట్టే.. వరుడికే చిర్రెత్తుకొచ్చి పెళ్లిని ఆపేసినంత పనిచేశాడు..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి, చివరికీ అందరినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇంకొందరైతే అంతటితో ఆగకుండా దాడులకు తెగబడుతుంటారు. వీరి కారణంగా అభం శుభం తెలియని అమాయకులు బలవుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి వల్ల దాదాపు వివాహం ఆగిపోయేంత పనైంది. దీంతో వరుడికి తీవ్ర ఆగ్రహం వచ్చి పెళ్లిని రద్దు చేసుకునే వరకూ వచ్చాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధి రాంపూర్ కార్ఖానాధుస్ ప్రాంతానికి చెందిన యువకుడికి.. మాధవపూర్ గ్రామనికి చెందిన యువతితో (young woman) వివాహం నిశ్చయమైంది. గురువారం వివాహ కార్యక్రమం (marriage) ఉండడంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. రాత్రి 9.30గంటలకు వరుడు ఊరేగింపుగా గ్రామానికి చేరుకున్నాడు. అనంతరం అతిథుల సమక్షంలో వరమాల కార్యక్రమానికి సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు చేశాక.. వధూవరులు ముస్తాబై వేదిక పైకి వెళ్లారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ సమయంలో వరుడి తరపు వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నాడు. ఫొటో (Photo) తీసే విషయంలో అందరితో గొడవ పెట్టుకున్నాడు.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

తానే ఫొటో తీయాలంటూ వాదనకు దిగాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వరుడి మామ కలుగజేసుకుని అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు.. వరుడి మామపై దాడికి (attack) దిగాడు. ఈ దాడిలో వరుడి సోదరికి కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని (injured) చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలతో వరుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ‘‘నాకు ఈ పెళ్లే వద్దు’’.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. చివరకు వరుడికి నచ్చజెప్పడంతో అయిష్టంగానే వధువు మెడలో తాళి కట్టాడు. ఎట్టకేలకు వివాహం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..

Updated Date - 2023-03-10T18:21:58+05:30 IST