Viral Video: ఈ పోలీసుల హోలీ వేడుకలు మామూలుగా లేవుగా.. ఫుల్‌గా మందు కొట్టి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే..

ABN , First Publish Date - 2023-03-10T15:50:34+05:30 IST

పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్ల తదితర వేడుకల్లో ఆకతాయిలు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. మగువల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు కొందరైతే.. మందు తాగి రచ్చరచ్చ చేసేవారు కొందరుంటారు. ఇలాంటి సందర్భాల్లో..

Viral Video: ఈ పోలీసుల హోలీ వేడుకలు మామూలుగా లేవుగా.. ఫుల్‌గా మందు కొట్టి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే..

పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్ల తదితర వేడుకల్లో ఆకతాయిలు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. మగువల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు కొందరైతే.. మందు తాగి రచ్చరచ్చ చేసేవారు కొందరుంటారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు ఎంటరై.. ఆకతాయిల ఆట కట్టిస్తుంటారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాగే జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. అల్లరిమూకలను అదుపు చేయాల్సిన పోలీసులు.. బాధ్యతలను మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా, జార్ఖండ్‌లో ఇలాగే జరిగింది. హోలీ వేడుకల పేరుతో కొందరు పోలీసులు (Police).. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ఫుల్‌గా మంది కొట్టి హల్‌చల్ చేశారు. చివరకు ఏమైందంటే..

జార్ఖండ్ (Jharkhand) గొడ్డా జిల్లాలోని పోలీస్ స్టేషన్ క్యాంపస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం స్థానికంగా హోలీ వేడుకలు (Holi celebrations) నిర్వహించారు. స్థానిక పోలీసులు కూడా వేడుకలు చేసుకున్నారు. రంగులు చల్లుకుని ఉండుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదేమో గానీ.. ఈ పోలీసులు చేసిన పనికి స్థానికులతో పాటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా షాక్ అయ్యారు. క్యాంపస్‌లో ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు రంగులు చల్లుకుని వేడుకలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా పోలీస్ క్యాంపస్‌నే (Police Campus) బార్‌గా మార్చేశారు. అంతా ఫుల్‌గా మందు కొట్టారు. అంతటితో ఆగకుండా డాన్సులు వేస్తూ రచ్చరచ్చ చేశారు.

Viral Video: ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ జంట.. పక్కనే వచ్చి ఆగిన పోలీసు కారు.. చివరకు జరిగింది చూసి నెటిజన్లు ఫిదా..!

ఓ పోలీసు అయితే.. ఏకంగా తలపై మందు గ్లాసు పెట్టుకుని బ్రేక్ డాన్స్ (Dance) చేశాడు. పక్కనున్న వారు వారిని ఎంకరేజ్ చేస్తూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ (Viral videos) అవడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. గురువారం ఈ వీడియోను జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండీ షేర్ చేశారు. దీంతో ఈ ఘటనను మరింత సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. మొత్తానికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-10T15:50:34+05:30 IST