LIC Money: ఎల్ఐసీ డబ్బుల కోసం చనిపోయినట్టు నాటకం.. ఫేక్ తల్లిదండ్రులను అరేంజ్ చేశాడు కానీ.. కన్నతల్లే ఎలా బయటపెట్టిందంటే..

ABN , First Publish Date - 2023-03-09T19:24:12+05:30 IST

సులభంగా డబ్బు సంపాదించాలనే క్రమంలో కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తుంటారు. ఇలాంటి వారి ఆలోచనలు మొదట పని చేసినా.. చివరకు..

LIC Money: ఎల్ఐసీ డబ్బుల కోసం చనిపోయినట్టు నాటకం.. ఫేక్ తల్లిదండ్రులను అరేంజ్ చేశాడు కానీ.. కన్నతల్లే ఎలా బయటపెట్టిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

సులభంగా డబ్బు సంపాదించాలనే క్రమంలో కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తుంటారు. ఇలాంటి వారి ఆలోచనలు మొదట పని చేసినా.. చివరకు ఎలాగోలా బండారం బయటపడుతుంటుంది. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చిది. ఓ వ్యక్తి ఎల్ఐసీ డబ్బుల కోసం చనిపోయినట్టు నాటకం ఆటాడు. ఈ క్రమంలో ఫేక్ తల్లిదండ్రులను కూడా అరేంజ్ చేశాడు. అయితే అతడి కన్న తల్లి ద్వారా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర (Maharashtra) ముంబయి పరిధి అహ్మద్‌నగర్‌కు చెందిన దినేశ్ అనే యువకుడు ఇంజినీరింగ్ డిప్లొమా (Diploma in Engineering) పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే జీతం అంతంతమాత్రమే కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తన కోరికలు, ఆశలు తీరకపోవడతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఏదోటి చేసి బాగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు ఓ సలహా ఇచ్చారు. అది విన్న దినేశ్... అరె! ఇదేదో బాగుందే.. ఈజీగా కోటీశ్వరుడిని అవ్వొచ్చు.. అని అనుకున్నాడు. వారి ప్లాన్ ప్రకారం.. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా రూ.5, రూ.3కోట్ల విలువైన పాలసీల (LIC Policies) కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..

తనకు వ్యవసాయం (agriculture) ద్వారా ఏటా రూ.38లక్షలు, అలాగే మెస్ నడపడం ద్వారా రూ.3లక్షల ఆదాయం వస్తుందంటూ నకిలీ పత్రాలు (Fake documents) సృష్టించాడు. చివరకు 2015 జూలైలో దినేశ్ దరఖాస్తును ఎస్ఐసీ ఆమోదించింది. రూ.8కోట్లకు బీమా చేయాలని ప్లాన్ చేసినా.. చివరకు 35ఏళ్లకు గాను రూ.2కోట్ల మొత్తానికి మాత్రమే సంస్థ పాలసీ జారీ చేసింది. ఇందుకోసం తొలి ప్రీమియంగా దినేశ్ రూ.1.46లక్షలు చెల్లించాడు. ఇలా మొత్తం తాను దాచుకున్న రూ.5లక్షలను ప్రీమియం (LIC Premium) రూపంలో చెల్లించాడు. తర్వాత అసలు ప్లాన్ అమలు చేశాడు. ఏడాది తర్వాత ఓ ఆస్పత్రిలో గుర్తు తెలియని శవాన్ని ఎంచుకున్నారు.

ప్రాణ స్నేహితురాలి వివాహం.. తప్పకుండా వెళ్లాలన్న భార్య.. సరేనని పుట్టింటికి పంపించిన భర్తకు మర్నాడే ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి చెప్పింది విని..

ఆ శవం తమ కుమారుడిదేనంటూ వైద్యులకు చెప్పి, తీసుకెళ్లి దహనక్రియలు కూడా చేశారు. 2017లో నందా భాయ్ టక్సలే అనే మహిళను తన తల్లిగా పేర్కొంటూ ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసుకు (LIC Branch Office) పంపించాడు. తన కుమారుడు 2016లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పేర్కొంటూ పాలసీ క్లెయిమ్ (Policy Claim) కోసం దరఖాస్తు చేసింది. అనంతరం డాక్యుమెంట్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు (Death certificate) కరెక్ట్ గానే ఉన్నా.. తక్కువ సమయంలో క్లెయిమ్ చేయడంతో అధికారులకు అనుమానం వచ్చింది.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

దీంతో చివరకు 2023 ఫిబ్రవరి 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడి తల్లి నందాబాయిపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఆమె ప్రమేయం లేదని తెలుసుకున్న పోలీసులు లోతుగా విచారించా.. అతడి తల్లి కుమారుడి గురించి తెలియజేసింది. దీంతో చివరకు దినేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దినేశ్‌తో పాటూ అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-09T19:24:12+05:30 IST