ప్రాణ స్నేహితురాలి వివాహం.. తప్పకుండా వెళ్లాలన్న భార్య.. సరేనని పుట్టింటికి పంపించిన భర్తకు మర్నాడే ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి చెప్పింది విని..

ABN , First Publish Date - 2023-03-07T15:39:46+05:30 IST

ఆరు నెలల క్రితం వారి వివాహం జరిగింది. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో ఆమె అక్కడ ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఇటీవల తన స్నేహితురాలి వివాహం ఉండడంతో పుట్టింటికి వెళ్తానంటూ..

ప్రాణ స్నేహితురాలి వివాహం.. తప్పకుండా వెళ్లాలన్న భార్య.. సరేనని పుట్టింటికి పంపించిన భర్తకు మర్నాడే ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి చెప్పింది విని..

ఆరు నెలల క్రితం వారి వివాహం జరిగింది. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో ఆమె అక్కడ ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఇటీవల తన స్నేహితురాలి వివాహం ఉండడంతో పుట్టింటికి వెళ్తానంటూ భర్తను కోరింది. ప్రాణ స్నేహితురాలు అని చెబుతుండడంతో అతను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెళ్లిరా అంటూ పంపించాడు. అయితే మరుసటి రోజే అతడికి అత్తగారి ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పింది విని షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హర్యానా (Haryana) అంబాలా పరిధి తాల్హేడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను (daughter) అంబాలా కాంట్‌లోని పీఎన్‌టీ కాలనీకి చెందిన రవికాంత్‌కు ఇచ్చి 2022 సెప్టెంబర్ 5న వివాహం (marriage) చేశారు. అనంతరం ఆమె అత్తగారి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది. తమ కూతురు భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా లేదని తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండేవారు. ఆమె సొంతూర్లో మార్చి 5న తన స్నేహితురాలి వివాహం ఉంది. దీంతో ఎలాగైనా పెళ్లికి వెళ్లాలంటూ భర్తను అడిగింది. సరే వెళ్లు.. అంటూ భర్త కూడా ఆమెను పంపించాడు. దీంతో ఆమె తల్హేడిలోని తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం తన స్నేహితురాలి వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ అందరితో సరదా సరదాగా గడిపింది.

Viral Video: ప్రేమికుల వద్దకు వచ్చిన యువతి.. సడన్‌గా యువకుడికి ముద్దు పెట్టి వెళ్లింది.. చివర్లో ప్రేయసి ఎక్స్‌ప్రెషన్ చూస్తే..

రాత్రి అంతా కలిసి ఒకేచోట పడుకున్నారు. అయితే ఉదయం లేచి చూస్తే కూతురు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి చుట్టుపక్కల వెతికారు. అయితే ఎక్కడ చూసినా ఆమె జాడ మాత్రం కనిపించలేదు. చివరికి అల్లుడి ఇంటికి ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో అక్కడికీ రాలేదని చెప్పారు. పెళ్లికి వెళ్లొస్తానని చెప్పిన భార్య.. సడన్‌గా కనిపించికుండా పోయేసరికి భర్తతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలిస్తున్నారు. మహిళ అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా.. లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..

Updated Date - 2023-03-07T15:39:46+05:30 IST