Kidney Problems: కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరగడం వెనుక అసలు కారణం ఇదన్నమాట.. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారా..?

ABN , First Publish Date - 2023-03-04T21:17:55+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ.. అనారోగ్య సమస్యలు మాత్రం చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో చాలా మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల..

Kidney Problems: కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరగడం వెనుక అసలు కారణం ఇదన్నమాట.. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారా..?

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ.. అనారోగ్య సమస్యలు మాత్రం చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో చాలా మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, గుండె జబ్బులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలతో (Kidney problems) కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరగడానికి గల కారణాలు వెల్లడయ్యాయి. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి..

ఇటీవల ఢిల్లీలో (Delhi) కిడ్నీ సమస్యలకు గల ప్రధాన కారణాలపై అధ్యయనం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వైద్య నిపుణులు (Medical professionals) పాల్గొన్నారు. కిడ్నీ సమస్యలు పెరిగిపోవడానికి గల ప్రధాన కారణాలను వారు వెళ్లడించారు. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులూ (Medicines) తీసుకోకూడదని తెలిపారు. కొందరు వైద్యులను సంప్రదించకుండా.. తమకు తోచిన మందులను ఎడాపెడా వాడేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, యాంటీ బాక్టీరియా, యాంటీ కేన్సర్ తదితర మందులను వైద్యుల సూచన మేరకు.. కొంత మోతాదులో మాత్రమే తీసుకోవాలని తెలిపారు.

ఎవరీ సంతోష్ మిశ్రా..? నెట్టింట వైరల్‌గా మారిన ఐపీఎస్ ఆఫీసర్ పెళ్లి ఫొటోలు.. అమెరికాలో రూ.50 లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు గుడ్‌బై చెప్పి..

Kidney-Patients.jpg

అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు వాడితే కిడ్నీలను దెబ్బతీస్తాయన్నారు. ఎమిల్ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంచిత్ శర్మ మాట్లాడుతూ కిడ్నీల విషయంలో ప్రతి ఒక్కరూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా మందులు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాగే దూమపానం, మద్యపానాకి (Smoking and drinking) దూరంగా ఉండడంతో పాటూ రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా అధిక కొలెస్ట్రాల్ (High cholesterol) ఉండే ఆహారాన్ని నివారించడంతో పాటూ రోజూ తగినంత నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Viral Video: మెట్రో రైల్లో ఇవేం పనులు తల్లీ.. ప్రయాణీకులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే సడన్‌గా ఓ యువతి మధ్యలోకి వచ్చి..

Updated Date - 2023-03-04T21:17:55+05:30 IST