Viral Video: నీటి ఏనుగును టార్గెట్ చేసిన సింహం.. ప్రయత్నించింది కానీ.. చివర్లో మాత్రం..

ABN , First Publish Date - 2023-03-04T20:29:34+05:30 IST

అడవికి రాజు అని పిలువబడే సింహం.. ఏ జంతువు మీదనైనా దాడికి వెనుకాడదు. గాయాలైనా సరే.. ఎలాగైనా వేటను సొంతం చేసుకోవాలని చూస్తుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం..

Viral Video: నీటి ఏనుగును టార్గెట్ చేసిన సింహం.. ప్రయత్నించింది కానీ.. చివర్లో మాత్రం..

అడవికి రాజు అని పిలువబడే సింహం.. ఏ జంతువు మీదనైనా దాడికి వెనుకాడదు. గాయాలైనా సరే.. ఎలాగైనా వేటను సొంతం చేసుకోవాలని చూస్తుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం సింహానికి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు చిన్న చిన్న జంతువులను సైతం వేటాడలేక వెనుదిరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ సింహం నీటి ఏనుగును టార్గెట్ చేస్తుంది. అయితే చివర్లో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో సింహం, నీటి ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో (Lion and hippo videos) తెగ వైరల్ అవుతోంది. ఓ సరస్సులో నీటి ఏనుగు తన పిల్లలతో కలిసి నీరు తాగుతూ ఉంటుంది. అదే సమయంలో పక్కనే ఉన్న కొన్ని సింహాలు వీటిని గమనిస్తాయి. దాడి చేయడం కష్టమని తెలిసినా.. ఎలాగోలా ప్లాన్ చేయాలని చూస్తాయి. వాటిలో ఓ సింహం సరస్సు వద్దకు వచ్చి.. నీటి ఏనుగును గమనిస్తూ, మరోవైపు కంగారు కంగారుగా నీరు తాగుతూ ఉంటుంది. కాసేపటికి సింహం స్కెచ్‌ను పసిగట్టిన నీటి ఏనుగు.. ఆగ్రహంతో ఊగిపోతుంది.

35 ఏళ్ల వయసు దాటినా ఎంతకూ పెళ్లి కావడం లేదని ఇద్దరు అన్నాదమ్ముళ్ల నిర్వాకమిదీ.. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు..!

పరుగు పరుగున సింహం పైకి దాడి చేసేందుకు (Attacking the lion) వెళ్తుంది. అప్పటికే భయం భయంగా ఉన్న సింహం.. నీటి ఏనుగును చూడగానే దూరంగా పారిపోతుంది. దీంతో అటు పక్కనే ఉన్న మిగతా సింహాలు కూడా పారిపోయేందుకు సిద్ధమవుతాయి. సింహాన్ని హెచ్చరించిన నీటి ఏనుగు.. తన పిల్లలను కాపాడుకునేందుకు వేగంగా వాటి వద్దకు వస్తుంది. పారిపోయిన సింహం.. ఈ రోజు మనం పస్తులే... అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: మెట్రో రైల్లో ఇవేం పనులు తల్లీ.. ప్రయాణీకులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే సడన్‌గా ఓ యువతి మధ్యలోకి వచ్చి..

Updated Date - 2023-03-04T20:29:34+05:30 IST