Viral Video: పాము, ముంగిస వీడియోలను ఎన్నో చూసి ఉంటారు.. కానీ విష సర్పంతో ఓ కుక్క కొట్లాడితే.. ఇదిగో ఇలా ఉంటుంది..!

ABN , First Publish Date - 2023-02-22T20:34:23+05:30 IST

జనావాసాల్లోకి పాములు చొరబడే ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలో వాటి బారిన పడి జంతువులు, కొన్నిసార్లు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొన్ని సార్లు ..

Viral Video: పాము, ముంగిస వీడియోలను ఎన్నో చూసి ఉంటారు.. కానీ విష సర్పంతో ఓ కుక్క కొట్లాడితే.. ఇదిగో ఇలా ఉంటుంది..!

జనావాసాల్లోకి పాములు చొరబడే ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలో వాటి బారిన పడి జంతువులు, కొన్నిసార్లు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొన్ని సార్లు స్నేక్ క్యాచర్లు అప్రమత్తమై.. వాటిని పట్టుకుని సురక్షిత ప్రదేశాల్లో వదిలిపెడుతుంటారు. ఇకపోతే.. పాముకు, జంతువులకు సంబంధించిన పోట్లాట వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. పాము, ముంగిస పోట్లాట వీడియోలు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే విష సర్పంతో కుక్క పోట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా (Trending videos) మారింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కుక్క, పాము పోట్లాటకు సంబంధించిన వీడియో (Dog and snake fight videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటి ఆవరణలోకి పెద్ద పాము ప్రవేశిస్తుంది. గమనించిన సదరు ఇంటి యజమాని.. వెంటనే తన పెంపుడు కుక్కను అప్రమత్తం చేస్తాడు. యజమాని ఆదేశాలతో కుక్క వెంటనే పాముతో పోటీకి సిద్ధపడుతుంది. కుక్కను గమనించిన పాము.. మెలికలు తిరుగుతూ బుస కొడుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా కుక్క మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గదు. నీ పాము వేషాలు.. నా దగ్గర వెయ్యకు.. అన్నట్లుగా పోటాపోటీగా మొరుగుతూ పామును హెచ్చరిస్తుంది. అప్పటికైనా పాము.. పారిపోయి ఉంటే ప్రాణాలతో బయటపడేదేమో.. కానీ ఆ పాము అలా చేయకుండా ఎలాగైనా కుక్కను చంపేయాలని ప్రయత్నిస్తుంది.

Viral Video: ఎవరీ కుర్రాడు.. వెంటనే కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీల ట్వీట్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

ఈ క్రమంలో పలుమార్లు కాటు వేయాలని (snake bite) కూడా ప్రయత్నిస్తుంది. అయితే కుక్క మాత్రం పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ.. పాము పైనే దాడి చేస్తుంది. చివరకు ఈ కుక్కతో కొట్లాడటం నా వల్ల కాదు.. అన్నట్లుగా గడ్డి పొదల్లోకి వెళ్లిపోతున్న పామును కుక్క తన నోటితో పట్టుకుని విదిలించి, విదిలించి మరీ నేల కేసి కొడుతుంది. ఈ పోరాటంలో చివరకు పాము తన ప్రాణాలను పోల్పోతుంది. ఈ ఘటనను ఇంటి యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వామ్మో! ఇదెక్కడి కుక్కరా.. నాయనా.. అంటూ కొందరు, అయ్యో పాపం కుక్కను కాటు వేయలేదు కదా.. అని ఇంకొందరు, పామును పట్టించి అడవిలో వదిలేసి ఉంటే బాగుండేది.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకున్న నవ వధువు.. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె చేసిన నిర్వాకం..

Updated Date - 2023-02-22T20:39:36+05:30 IST