Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-03-07T21:20:51+05:30 IST

పురి విప్పిన నెమలిని చూస్తే.. ఎవరికైనా అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అలాంటి అందమైన నెమలిపై దాడి చేయాలని ఎవరికీ అనిపించదు. మనుషుల విషయంలో ఇది ఓకే గానీ.. జంతువులకు మాత్రం ఇంది వర్తించదు. సహజంగానే క్రూర జంతువైన పులికి అయితే..

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

పురి విప్పిన నెమలిని చూస్తే.. ఎవరికైనా అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అలాంటి అందమైన నెమలిపై దాడి చేయాలని ఎవరికీ అనిపించదు. మనుషుల విషయంలో ఇది ఓకే గానీ.. జంతువులకు మాత్రం ఇంది వర్తించదు. సహజంగానే క్రూర జంతువైన పులికి అయితే ఇది అసలు వర్తించదు. కళ్ల ముందు మనిషి ఉన్నా.. జంతువు ఉన్నా.. ఆఖరికి పక్షి ఉన్నా సరే.. దాడి చేయాడానికే ప్రయత్నిస్తుంది. పులి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులపై పులులు దాడి చేయడం (Tiger attack videos) చాలా చూసుంటాం. కానీ పక్షులపై.. అదీ అందమైన నెమలిపై దాడి చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం పురి విప్పిన నెమలిపై పులి దాడి చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో నెమలిపై పులి దాడి చేసిన వీడియో (Tiger Peacock Videos) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో కొన్ని నెమళ్లు మేత మేస్తూ ఉంటాయి. కొద్ది సేపటి తర్వాత వాటిలో ఓ పెద్ద నెమలి ఒక్కసారిగా పురి విప్పి నాట్యం చేస్తుంది. దీంతో అక్కడే ఉన్న పర్యాటకులు ఆ సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. నెమలి పక్కనే ఉన్న పొదల్లో ఓ పెద్ద పులి పొంచి ఉంటుంది. చాలా సేపటి నుంచి నెమలిపై దాడి చేసేందుకు కాపు కాచి ఉంటుంది. నెమలి పురి విప్పి అటు వైపు తిరిగి ఉంటుంది.

Viral Video: కోటి మందికి పైగా చూసిన వీడియో.. లక్షల కొద్దీ లైకులు.. ఇంతకీ ఈ బురద నీళ్లల్లో ఇతడేం చేస్తున్నాడంటే..

ఇదే మంచి సమయం అనుకున్న పులి.. ఒక్క ఉదుటున పొదల్లోంచి బయటకు వస్తుంది. నెమలి సమీపానికి వచ్చి ఇలా పంజా విసిరిందో లేదో.. నెమలి వెంటనే అలెస్ట్ అవుతుంది. ‘‘నువ్వు నన్ను ఏమీ చేయలేవ్ పులీ’’.. అంటూ రెక్కలు ఆడించుకుంటూ గాల్లోకి లేస్తుంది. దాంతో పాటూ పక్కనే ఉన్న చిన్న చిన్న నెమళ్లు కూడా పెద్ద నెమలిని అనుసరిస్తూ వెళ్లిపోతాయి. పంజా ఎత్తిన పులి.. ‘‘ఎలాగైనా వేటాడదాం అనుకుంటే.. ఇలా అయిందే’’.. అన్నట్లుగా నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

షాపులో బంగారు నగలు మిస్సింగ్.. నిలదీస్తే నాకేం తెలీదన్న యజమాని కొడుకు.. అనుమానంతో సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

Updated Date - 2023-03-07T21:20:51+05:30 IST