షాపులో బంగారు నగలు మిస్సింగ్.. నిలదీస్తే నాకేం తెలీదన్న యజమాని కొడుకు.. అనుమానంతో సీసీ కెమెరాలను చెక్ చేస్తే..
ABN , First Publish Date - 2023-03-07T16:25:58+05:30 IST
చోరీలు చేయడంలో కొందరి తెలివి తేటలు చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. పైకి అమాయకంగా కనిపిస్తూనే వారి పని వారు కానిచ్చేస్తుంటారు. అసలు విషయం తెలిసేదాకా వారు అమాయకులు కాదనే విషయం తెలీదు. ఇందుకు నిదర్శనంగా రోజూ..
చోరీలు చేయడంలో కొందరి తెలివి తేటలు చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. పైకి అమాయకంగా కనిపిస్తూనే వారి పని వారు కానిచ్చేస్తుంటారు. అసలు విషయం తెలిసేదాకా వారు అమాయకులు కాదనే విషయం తెలీదు. ఇందుకు నిదర్శనంగా రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. షాపులో బంగారు నగలు కనిపించకపోవడంతో యజమాని.. తన కొడుకును నిలదీశాడు. నాకేమీ తెలియదని అతను చెప్పడంతో చివరకు సీసీ కెమెరాలను పరిశీలించి షాక్ అయ్యాడు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్ పరిధి బీజై నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ గౌడ్ అనే వ్యక్తి.. స్థానిక శీత్లా మాతా గాలి కుమ్హర్ మొహల్లా బిజయ్ నగర్‌లో నగల దుకాణాన్ని (jewelry store) నిర్వహిస్తున్నాడు. ఇదిలా వుండగా, మార్చి 1న అతను పని మీద బయటికి వెళ్లాడు. ఆ సమయంలో తన కుమారుడు ఒక్కడే దుకాణంలో ఉన్నాడు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని మహిళలు (unidentified woman).. ఓ పిల్లాడిని తీసుకుని దుకాణానికి వెళ్లారు. దుకాణ యజమాని కొడుకుతో కొద్ది సేపు మాటలు కలిపారు. ఆ నగలు, ఈ నగలు అంటూ అతన్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇలా కొద్ది సేపటి తర్వాత ఓ మహిళ కోరిక మేరకు కొన్ని నగలను చూపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరో మహిళ అక్కడే ఉన్న నగల పెట్టెను తీసుకుని చీరలో దాచుకుంది.
తర్వాత షాపులోని నగలేవీ నచ్చలేదంటూ అక్కడి నుంచి తాపీగా జారుకున్నారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన యజమాని.. షాపులో చూసుకోగా అనుమానం వచ్చింది. దీంతో కొడుకును పిలిచి.. ‘‘షాపులో కొన్ని నగలు కనిపించలేదేంటీ’’.. అని గట్టిగా నిలదీశాడు. అందుకు అతను నాకేం తెలీదని సమాధానం ఇచ్చాడు. చివరకు షాపులోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించాడు. మహిళలు చేసిన పని చూసి షాక్ అయ్యాడు. స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాడు. చోరీ అయిన నగల (Jewelry theft) ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.