అమ్మా.. అని పిలిపించుకోవాలన్న కోరిక తీరకుండానే ఘోరం.. ఈ 7 నెలల గర్భవతి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-07T18:00:46+05:30 IST

ఏడో నెల కడుపుతో ఉన్న ఆమె.. త్వరలో తల్లి అవబోతున్నానని ఎంతో మురిసిపోయింది. అలాగే భర్త కూడా తండ్రి అవుతున్నాననే ఆనందంలో ఉన్నాడు. మరోవైపు.. మనువడో, మనువరాలో పుడితే..

అమ్మా.. అని పిలిపించుకోవాలన్న కోరిక తీరకుండానే ఘోరం.. ఈ 7 నెలల గర్భవతి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందో తెలిస్తే..

ఏడో నెల కడుపుతో ఉన్న ఆమె.. త్వరలో తల్లి అవబోతున్నానని ఎంతో మురిసిపోయింది. అలాగే భర్త కూడా తండ్రి అవుతున్నాననే ఆనందంలో ఉన్నాడు. మరోవైపు.. మనువడో, మనువరాలో పుడితే వారితో కలిసి ఆనందంగా గడపొచ్చని తల్లిదండ్రులు కూడా కలలు కంటూ ఉన్నారు. అయితే వీరందరి ఆశలు అడియాశలు అవుతాయని ఎవరూ ఊహించలేదు. అమ్మా.. అని పిలిపించుకోవాలన్న కోరిక తీరకుండానే.. ఈ ఏడు నెలల గర్భిణి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిందో తెలిస్తే.. అయ్యో పాపం.. అని అనిపించకమానదు...

రాజస్థాన్ (Rajasthan) సికర్‌లోని నీమ్‌కథానా పరిధి తోడా ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో దశరథ్ సింగ్(32), కంచన్ కన్వర్(30) దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. కాగా, కంచన్ కన్వర్ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి (pregnant). దీంతో దశరథ్ సింగ్ ప్రతి నెలా తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తూ ఉండేవాడు. త్వరలో తమ ఇంట్లో కొడుకో, కూతురో పుడుతుందని అంతా సంతోషంగా ఉండేవారు. ఏడో నెల రావడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన తండ్రి వర్ధంతి ఉండడంతో హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం సాయంత్రం ఇంటికి వచ్చాడు. మరోవైపు గ్రామంలో హోలీ వేడుకలు (Holi celebrations) కూడా జరుగుతన్నాయి. సోమవారం ఉదయం భార్యను బైకులో ఎక్కించుకుని నీమ్‌కథాలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ప్రాణ స్నేహితురాలి వివాహం.. తప్పకుండా వెళ్లాలన్న భార్య.. సరేనని పుట్టింటికి పంపించిన భర్తకు మర్నాడే ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి చెప్పింది విని..

rajastan-rod-accident.jpg

వైద్య పరీక్షలు (Medical tests) పూర్తయిన అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరారు. తోడ ప్రాంతానికి సమీపంలో వీరి బైకును ఓ లారీ వెనుక నుంచి (lorry hit the bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంచన్ కన్వర్ అక్కడికక్కడే మృతి (death) చెందింది. తీవ్రంగా గాయపడిన దశరథ్ సింగ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి వెళ్లిన కొడుకు, కోడలి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు.. వారి మరణవార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అమ్మా.. అని పిలుపించుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా.. అంటూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

షాపులో బంగారు నగలు మిస్సింగ్.. నిలదీస్తే నాకేం తెలీదన్న యజమాని కొడుకు.. అనుమానంతో సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

Updated Date - 2023-03-07T18:00:46+05:30 IST