Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

ABN , First Publish Date - 2023-03-08T21:16:07+05:30 IST

ఆపద సమయంలో రక్షించాల్సిన రక్షకభటులు కొందరు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు కాసుల కోసం కక్కర్తి పడి నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు కామాంధులుగా మారి.. రేపిస్టులకు, మాకు తేడా ఏమీ లేదు అని నిరూపిస్తుంటారు. వీరి వల్ల..

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

ఆపద సమయంలో రక్షించాల్సిన రక్షకభటులు కొందరు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు కాసుల కోసం కక్కర్తి పడి నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు కామాంధులుగా మారి.. రేపిస్టులకు, మాకు తేడా ఏమీ లేదు అని నిరూపిస్తుంటారు. వీరి వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు వస్తుంటుంది. ఇలాంటి పోలీసులను చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోలీసు చేసిన పని చూస్తే.. ఛీ! వీడు అసలు మనిషేనా అని మీరే అంటారు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న యువతి పట్ల అతను ఎలా ప్రవర్తించాడంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఓ యువతి (young woman) రోడ్డుపై ఒంటరిగా నిలబడి ఉంటుంది. ఎక్కడి వెళ్లాలో, ఎవరి కోసం ఎదురు చూస్తోందో తెలీదు గానీ ఒక్కటే నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఓ బైకులో వెళ్తున్న పోలీసు.. ఆమెను గమనిస్తాడు. ఆ పరిస్థితిలో ఏ పోలీసు ఉన్నా.. ఆమె గురించి విచారించి, ఇంటి వద్ద వదిలిపెట్టి వస్తారు. కానీ ఈ పోలీసు (Police Constable) మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. లారీల మధ్యలో నిలబడి ఉన్న ఆమె వద్దకు బైకులో వెళ్తాడు. బైకులో కూర్చునే ఆమెను గట్టిగా పట్టుకుని (Indecent behavior) దగ్గరకు లాక్కుంటాడు. ‘‘వద్దు వద్దు.. నన్ను వదులు’’ అని బతిమాలుతున్నా వినిపించుకోకుండా ఆమెను తాకరాని చోట తాకుతా తన పైశాసికత్వాన్ని ప్రదర్శిస్తాడు.

భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..

ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా అత్యంత నీచంగా ప్రవర్తిస్తాడు. చివరకు ఎలాగోలా అతడి నుంచి విడిపించుకుని పక్కకు వెళ్లిపోతుంది. అయినా అతను వదలకుండా ముందుకు వెళ్లి బైకు పక్కన ఆపి, ఆమెను పట్టుకోవాలని చూస్తాడు. అయితే అప్పటికే ఆమె రోడ్డు దాటి దూరంగా వెళ్తుంది. మళ్లీ బైకు ఎక్కి ఆమెను వెంబడించే ప్రయత్నించే ప్రయత్నం చేస్తాడు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోలీసులను ప్రజల సమక్షంలో కఠినంగా శిక్షించాలి.. అంటూ కొందరు, వీడియో తీసిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆమెను కాపాడి ఉండొచ్చుగా.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-03-08T21:16:07+05:30 IST