Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-03-22T18:53:49+05:30 IST

చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంలా.. కొన్నిసార్లు ప్రమాదాల అంచుల వరకూ వెళ్లి క్షేమంగా బయటపడుతుంటారు. కొందరైతే జూలలో క్రూర మృగాలతో చెలగాటం ఆడాలని చూసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలా జరిగాయి. అయితే..

Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంలా.. కొన్నిసార్లు ప్రమాదాల అంచుల వరకూ వెళ్లి క్షేమంగా బయటపడుతుంటారు. కొందరైతే జూలలో క్రూర మృగాలతో చెలగాటం ఆడాలని చూసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలా జరిగాయి. అయితే ఇంకొన్నిసార్లు మాత్రం ఆశ్చర్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింహం నుంచి తెలివిగా తప్పించుకుంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సింహాన్ని ఇలాక్కూడా ఫూల్ చేయొచ్చా.. అని కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో సింహానికి సంబంధించిన వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ జంగిల్ సఫారీ పార్కులో (jungle safari park) కొందరు వాహనాల మీద ప్రయాణిస్తూ వన్యప్రాణులను చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓపెన్ టాప్ జీపులో (Open top jeep) ముందు వైపు ఏర్పాటు చేసిన కుర్చీపై కూర్చుని ఉంటాడు. పార్కులోని అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. సడన్‌గా అక్కడికి ఓ సింహం (lion) వస్తుంది. దీంతో ఒక్కసారిగా భయపడిపోతాడు. అయితే అప్పటికే సింహం సమీపానికి రావడంతో చివరకు ప్రాణాలకు తెగించి అలాగే కూర్చుండిపోతాడు.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

సింహం కూడా చాలా సేపు అతన్ని గమనిస్తుంది. అయితే అతను మాత్రం చాలా తెలివిగా కొంచెం కూడా కదలకుండా బొమ్మలా ఉండిపోతాడు. అతన్నే గమనిస్తున్న సింహం.. తర్వాత అది బొమ్మేమో అనుకుని అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోతుంది. ఈ ఘటనను జీపులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సింహాన్ని భలేగా ఫూల్ చేశాడు.. అని కొందరు, ఈ సింహం వెజిటేరియన్ అయి ఉంటుంది.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: స్కూటీని ఇలా స్టార్ట్ చేస్తున్నారా... అయితే ఓసారి ఈ వీడియో చూడండి..

Updated Date - 2023-03-22T18:53:49+05:30 IST