Beggar: ఓ బిచ్చగాడి సంచిలో ఆధార్‌కార్డు.. అతడెవరో ఆరా తీసి అవాక్కైన పోలీసులు.. మాస్టర్ డిగ్రీ చదివి కూడా ఎందుకిలా పిచ్చోడయ్యాడో తెలిసి..

ABN , First Publish Date - 2023-03-23T19:54:21+05:30 IST

సంతోషంగా సాగుతున్న జీవితాన్ని.. కొన్ని అనూహ్య ఘటనలు ఒక్కసారిగా పూర్తిగా మార్చేస్తుంటాయి. కొన్ని ఘటనలు కొందరిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే.. మరికొందరిని అధఃపాతాళానికి నెట్టేస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువకుడి జీవితంలో ...

Beggar: ఓ బిచ్చగాడి సంచిలో ఆధార్‌కార్డు.. అతడెవరో ఆరా తీసి అవాక్కైన పోలీసులు.. మాస్టర్ డిగ్రీ చదివి కూడా ఎందుకిలా పిచ్చోడయ్యాడో తెలిసి..

సంతోషంగా సాగుతున్న జీవితాన్ని.. కొన్ని అనూహ్య ఘటనలు ఒక్కసారిగా పూర్తిగా మార్చేస్తుంటాయి. కొన్ని ఘటనలు కొందరిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే.. మరికొందరిని అధఃపాతాళానికి నెట్టేస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువకుడి జీవితంలో కూడా ఇలాగే జరిగింది. వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఓ బిచ్చగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సంచిలోని ఆధార్ కార్డు ద్వారా విచారించారు. మాస్టర్ డిగ్రీ చదివి కూడా అతడి ఇలా అవ్వడానికి గల కారణం తెలుసుకుని అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళ (Kerala) కొళ్లాం పరిధి కరునాగపపల్లికి చెందిన రాజశేఖరన్ కుటపన్‌కు అనుప్ రాజశేఖరన్ అనే కొడుకు ఉన్నాడు. ఈ యువకుడు అనూప్ ఆక్వా కల్చర్ అండ్ ఫిషరీస్ సైన్స్‌లో (Anup Aqua Culture and Fisheries Science) మాస్టర్స్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఇతడి జీవితం.. అనూహ్య మలుపు తీసుకుంది. రెండేళ్ల క్రితం ఇతడికి ఫేస్‌బుక్‌లో (Facebook) ముంబైకి చెందిన ఓ యువతి పరిచయమైంది. రోజూ చాటింగ్ చేసుకునే క్రమంలో వీరి మధ్య చనువు ఏర్పడింది. తర్వాత ఏకంగా ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ రోజూ మాట్లాడుకునేవారు. కొన్ని నెలల్లోనే వారి మధ్య ప్రేమ మొదలైంది. ఎలాగైనా ప్రియురాలిని (girlfriend) కలవాలని అనుకునేవాడు.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

ఈ క్రమంలో ఉద్యోగ వేటలో భాగంగా ముంబై (Mumbai) వెళ్తున్నానని ఇంట్లో చెప్పి 2022లో వచ్చేశాడు. ముంబై వచ్చాక ప్రియురాలిని కలిశాడు. అయితే ఆమె మొదటి పరిచయంలోనే తిరస్కరించింది. ‘‘నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టమూ లేదు’’.. అని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మనసు మార్చుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ముంబై వీధుల్లోనే తిరుగుతూ చివరకు బిచ్చగాడిలా (begging) మారిపోయాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ అడుక్కోవడం, ఎక్కడ వీలుంటే అక్కడ పడుకోవడం చేస్తుండేవాడు.

Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

ఇలావుండగా, ఇటీవల ముంబై పోలీసులు యాంటీ బెగ్గింగ్ డ్రైవ్‌ (Anti Begging Drive) చేపట్టారు. ఈ సందర్భంగా అనూప్‌ను కూడా అదుపులోకి తీసుకుని, అతడి బ్యాగును పరిశీలించారు. ఆధార్ కార్డు ఆధారంగా.. కేరళ కొళ్లాం పోలీసులకు సమాచారం అందించారు. చివరకు అతడి గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. అనంతరం యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, మంగళవారం అతడి తండ్రిని పిలిపించి అప్పగించారు. మొత్తానికి యువకుడికి సంబంధిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

Updated Date - 2023-03-23T19:54:21+05:30 IST