21 ఏళ్ల ఈ యువతికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.. కానీ ఏ తప్పూ చేయకున్నా ఎలా ప్రాణం పోయిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-23T17:02:52+05:30 IST

వారి ఒక్కగానొక్క కూతురుకు ఘనంగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అంతా కలిసి నిద్రాహారాలు లేకుండా కష్టపడుతూ డబ్బులు కూడబెడుతున్నారు. యువతి కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా...

21 ఏళ్ల ఈ యువతికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.. కానీ ఏ తప్పూ చేయకున్నా ఎలా ప్రాణం పోయిందో మీరే చూడండి..!

వారి ఒక్కగానొక్క కూతురుకు ఘనంగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అంతా కలిసి నిద్రాహారాలు లేకుండా కష్టపడుతూ డబ్బులు కూడబెడుతున్నారు. యువతి కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా తన కాళ్ల మీద నిలబడి సొంతంగా సంపాదిస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సడన్‌గా చోటు చేసుకున్న ఘటన అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఏ తప్పూ చేయకున్నా ఆమె ప్రాణాలను కోల్పోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్పూర్ కటంగి పరిధి బోరియా గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంకితా సేన్ (21) అనే యువతి బ్యూటీ పార్లర్ (Young women beauty parlour) నడుపుతూ ఉంటుంది. అలాగే ఈమె గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతంలో విద్యార్థులకు ట్యూషన్ కూడా చెబుతోంది. వీరి కుటంబ ఆర్థిక పరిస్థితి (Financial situation) అంతంతమాత్రమే కావడంతో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా తాను కూడా సంపాదనలోకి దిగింది. ప్రస్తుతం అంకితా నెలకు రూ.15వేలకు పైగా సంపాదిస్తోంది. అంకితాకు సచిన్ అనే అన్న ఉన్నాడు. ఇదిలావుండగా, ఇటీవల అంకితాకు ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు (Marital relations) చూస్తున్నారు.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

కూతురు పెళ్లి కోసం అంతా కలిసి డబ్బులు కూడా కూడబెడుతున్నారు. ఈ ఏడాదిలో ఎలాగైనా అంకిత పెళ్లి చేయాలని ఈ కుటుంబం బలంగా నిర్ణయించుకుంది. దీనికి అంకితా కూడా అంగీకరించడంతో.. మంచి సంబంధం కోసం వెతకడం మొదలెట్టారు. మరోవైపు జనవరి 2న అంకిత పుట్టిన రోజు (birthday) కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకుంది. అయితే ఇదే ఆమె ఆఖరి పుట్టిన రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. రోజూ మాదిరే మంగళవారం కూడా అంకిత.. ట్యూషన్ చెప్పేందుకు వెళ్లింది. దగ్గరే కావడంతో నడుచుకుంటూ వెళ్లి ట్యూషన్ చెప్పి తిరుగుప్రయాణమైంది. అయితే మార్గ మధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ కారు వద్దకు రాగానే ఎదురుగా ఓ బస్సు వచ్చింది.

Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

అదే సమయంలో వెనుక నుంచి ఓ లారీ వేగంగా వచ్చి అంకితను (lorry hit the young woman) ఢీకొట్టింది. చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపట్లో ఇంటికి రావాల్సిన కూతురు.. విగతజీవిగా రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సీసీ కెమెరాల వీడియోల ఆధారంగా పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం (neglect) కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు పూర్తిగా ఇటువైపు రావడంతో లారీ వెళ్లేందుకు అవకాశం లేక ఇలా జరిగిందని చెప్పారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల గతంలోనూ చాలా ప్రమాదాలు జరిగాయని, దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Heartbreak Insurance: ప్రేమలో ఉన్నోళ్లకు సూపర్ ఐడియా.. ప్రేయసి సడన్‌గా హ్యాండిచ్చినా కుర్రాళ్లు ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చట..!

Updated Date - 2023-03-23T17:02:52+05:30 IST