Mobile Blast: జీన్స్‌ ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ బ్లాస్ట్.. బైక్‌పై వెళ్తుండగానే ఘటన.. ఆ యువకుడి పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-23T21:22:04+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్‌లో గడపడం కూడా అంతే సాధారణమైపోయింది. కొందరు స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అవడం వల్ల నష్టపోతుంటే.. మరికొందరు..

Mobile Blast: జీన్స్‌ ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ బ్లాస్ట్.. బైక్‌పై వెళ్తుండగానే ఘటన.. ఆ యువకుడి పరిస్థితి ఏంటంటే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్‌లో గడపడం కూడా అంతే సాధారణమైపోయింది. కొందరు స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అవడం వల్ల నష్టపోతుంటే.. మరికొందరు అదే ఫోన్లు పేలిపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఫోన్లు పేలిపోయిన ఘటనల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను ఎన్నో చూశాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా.. ప్యాంట్ జేబులోని స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో చివరకు ఆ యువకుడి పరిస్తితి ఏంటంటే..

రాజస్థాన్ (Rajasthan) చురు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక 42వ వార్డులో నివాసం ఉంటున్న అర్బాజ్ ఖాన్.. తన తమ్ముడు నదీమ్‌కు పరీక్ష ఉండడంతో బుధవారం బైకులో తీసుకెళ్లాడు. రతన్‌గర్ రోడ్‌లోని ఓ స్కూల్లో నదీమ్ పరీక్ష (Exam) రాశాడు. అనంతరం తమ్ముడిని బైకులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంది. బైకులో వెళ్తుండగానే అర్బాజ్ ఖాన్ ఫ్యాంట్ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ (smartphone Exploded) ఒక్కసారిగా ఫట్‌మని పేలిపోయింది.

Banana Viral Video: ఒకే ఒక్క అరటిపండు కదా.. ఈజీగా తినేస్తామని అనుకుంటున్నారేమో.. దీన్ని తినడం అంత ఈజీ కాదండోయ్..!

ఈ అనూహ్య ఘటనతో వారిద్దరీ షాక్ అయ్యారు. అయితే వెంటనే తేరుకున్న అర్బాజ్ ఖాన్.. జేబులోని ఫోన్‌ను బయటికి తీసి విసిరేశాడు. అప్పటికే అతడి ఫ్యాంట్‌కు మంటలు అంటుకోవడంతో తొడ భాగం వద్ద కాలిపోయింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధితుడి తొడ భాగంలో 5శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ఎట్టకేలకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 15నెలల క్రితం Oppo కంపెనీకి చెందిన A54 ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, ఈ వార్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos videos) తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

Updated Date - 2023-03-23T21:22:04+05:30 IST