Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..

ABN , First Publish Date - 2023-03-24T17:43:10+05:30 IST

‘‘ఒడ్డున పడ్డ చేప బతుకులా మారింది’’.. ఈ మాటను సందర్భానుసారం అప్పుడప్పుడూ వాడుతూ ఉంటాం. చేపలు నీటిలో ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఒక్కసారి ఒడ్డున పడితే, ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఏదో అద్భుతం జరిగితే తప్ప..

Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..

‘‘ఒడ్డున పడ్డ చేప బతుకులా మారింది’’.. ఈ మాటను సందర్భానుసారం అప్పుడప్పుడూ వాడుతూ ఉంటాం. చేపలు నీటిలో ఉన్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఒక్కసారి ఒడ్డున పడితే, ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ చేప బతికే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే కొన్ని చేపల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుందట. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ చేప పూర్తిగా ఎండిపోయింది. చివరకు దాని నోట్లో నీరు పోయగానే ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించి వీడియో తెగ వైరల్ (Fish viral videos) అవుతోంది. బూడిద రంగులో ఉన్న ఓ చేప పూర్తిగా (dried fish) ఎండిపోయి ఉంటుంది. అది కూడా ఎంతలా అంటే.. దాని తోకను పట్టుకోగానే పలుకులు పలుకులుగా విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఏ చేపైనా బ్రతికే అవకాశ ఉండదు. కానీ ఓ వ్యక్తి ఎండిపోయిన ఆ చేప నోట్లో కొన్ని నీరు పోస్తాడు. దీంతో ఆశ్చర్యకరంగా దానికి ఊపిరి వస్తుంది. చనిపోయిందనుకున్న ఆ చేప విచిత్రంగా నీరు తాగడాన్ని వీడియోలో చూడొచ్చు.

Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..

సకర్‌మౌత్ క్యాట్‌ఫిష్‌ (Sugar Mouth catfish) అనే ఈ చేపను ప్లెకో అని కూడా పిలుస్తారట. ఈ రకం చేపలు తీవ్రమైన ఎండల్లోనూ ప్రాణాలతో ఉండగలవట. వర్షం వచ్చే వరకూ బురదలోనే నెలల తరబడి జీవించగలవు. వీటి పొత్తి కడుపులో తగినంత నీరు ఉండడం వల్ల ఒడ్డున కూడా 30 గంటల వరకూ ప్రాణాలతో ఉంటాయట. ఈ రకం చేపలు ఉత్తర, దక్షిణ అమెరికాలోని (South America) బురద చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తాయట. మొత్తానికి ఈ చేప వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

తలుపు వద్ద సీన్ చూడగానే అటకెక్కిన కుటుంబం.. గంటల తరబడి పైనే ఉండడంతో.. చుట్టు పక్కల వారు వచ్చి చూడగా..

Updated Date - 2023-03-24T17:43:10+05:30 IST