ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కోడే కదా నమిలేద్దాం అనుకుంది.. చివరకు ఆ కుక్క పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2023-03-26T19:54:34+05:30

పిల్లలను రంక్షించుకునే క్రమంలో తప్ప మిగతా సమయాల్లో కుక్కను చూడగానే కోడి పారిపోవడం జరుగుతుంటుంది. అలాగే కోళ్లను చూడగానే కొన్ని కుక్కలు దాడి చేసి చంపేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం తేడా కొడుతుంటుంది. ఎంత పెద్ద జంతువులైనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పిల్లలను రంక్షించుకునే క్రమంలో తప్ప మిగతా సమయాల్లో కుక్కను చూడగానే కోడి పారిపోవడం జరుగుతుంటుంది. అలాగే కోళ్లను చూడగానే కొన్ని కుక్కలు దాడి చేసి చంపేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం తేడా కొడుతుంటుంది. ఎంత పెద్ద జంతువులైనా అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువుల చేతిలో ఓడిపోతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుక్క, కోడి పోరాటానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్క కోడిని చంపేయాలని చూస్తుంది. అయితే చివరకు దాని పరిస్థితి ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ కుక్క కోడిని చూడగానే దాడి చేయాలని చూస్తుంది. కోడిని చంపేసి ఆకలి తీర్చుకోవాలని చూస్తుంది. వెంటనే కోడిని కాలితో పట్టుకుని కొరికేయాలని (Dog attack on chicken) చూస్తుంది. అయితే కుక్క దాడి చేసేందుకు ప్రయత్నించగానే కోడి అలెర్ట్ అవుతుంది. నన్ను చంపడం అంత ఈజీ కాదు.. అన్నట్లుగా కుక్కపై దాడికి దిగుతుంది. గాల్లోకి ఎగురుతూ కుక్క మూతిపై కాళ్లతో పదే పదే పొడుస్తుంది. కాసేపు కోడిని చంపాలని చూసినా.. చివరకు కుక్క తీవ్రంగా అలసిపోతుంది.

Viral Video: ఇలాంటి జిరాఫీల ఫైటింగ్.. ఎక్కడా చూసుండరు.. వామ్మో! మరీ ఇలా కొట్టుకున్నాయేంట్రా.. బాబూ...

‘‘వామ్మో! ఇది మామూలు కోడి కాదురోయ్’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా కోడి మాత్రం వదలదు. ఎక్కడికి వెళ్తావ్.. రా తేల్చుకుందాం.. అన్నట్లుగా దాని వెంటపడి మరీ దాడి చేస్తుంది. దీంతో చివరకు.. ‘‘నీతో కొట్లాడటం నా వల్ల కాదు బాబోయ్’’.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T19:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising