Viral Video: ఇలాంటి జిరాఫీల ఫైటింగ్.. ఎక్కడా చూసుండరు.. వామ్మో! మరీ ఇలా కొట్టుకున్నాయేంట్రా.. బాబూ...

ABN , First Publish Date - 2023-03-26T18:25:21+05:30 IST

జంతువుల మధ్య పోరాటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే పులులు, సింహాలు, ఏనుగులు.. తదితర జంతువులు పోట్లాడుకునే సన్నివేశాలు చూడటానికి భయంకరంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే..

Viral Video: ఇలాంటి జిరాఫీల ఫైటింగ్.. ఎక్కడా చూసుండరు.. వామ్మో! మరీ ఇలా కొట్టుకున్నాయేంట్రా.. బాబూ...

జంతువుల మధ్య పోరాటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే పులులు, సింహాలు, ఏనుగులు.. తదితర జంతువులు పోట్లాడుకునే సన్నివేశాలు చూడటానికి భయంకరంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే జిరాఫీల పోరాటానికి సంబంధించిన వీడియోలు చాలా కరుదుగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం రెండు జిరాఫీలు పోట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వామ్మో! జిరాఫీలు ఇలా కొట్టుకుంటున్నాయేంటీ.. అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో జిరాఫీల పోట్లాటకు సంబంధించిన వీడియో (giraffes fighting Videos) తెగ వైరల్ అవుతోంది. రెండు పెద్ద జిరాఫీల మధ్య ఫైటింగ్ మొదలవుతుంది. ఓ జిరాఫీ తన పొడవాటి తలతో పక్కన ఉన్న జిరాఫీ మెడపై కొడితే.. దెబ్బతిన్న జిరాఫీ కూడా అదే విధంగా తన తలతో కొడుతుంది. ఇలా చాలా సేపు అలా కొట్టుకుంటూనే ఉంటాయి. రెండూ కదలకుండా కేవలం తలతో మాత్రమే కొట్టుకోవడం చూడటానికి విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. జిరాఫీలు కొట్టుకోవడం చాలా భయానకంగా ఉంది.. అంటూ కొందరు, తలతో కొట్టుకోవడం చాలా విచిత్రంగా ఉంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T18:25:21+05:30 IST