Viral Video: భూకంపం వచ్చి అంతా ఇళ్ల నుంచి బయటికి పారిపోతుంటే.. మందు బాటిళ్ల కోసం ఇతని కక్కుర్తి చూడండి..

ABN , First Publish Date - 2023-03-26T16:16:32+05:30 IST

‘‘ఊపిరి ఉంటే.. ఉప్పు అమ్మి అయినా బతకొచ్చు’’. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఈ సామెతను గుర్తు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రాణాపాయం అని తెలిస్తే ఎవరూ ఎలాంటి సాహసాలు చేయరు. కానీ కొందరు మాత్రం..

Viral Video: భూకంపం వచ్చి అంతా ఇళ్ల నుంచి బయటికి పారిపోతుంటే.. మందు బాటిళ్ల కోసం ఇతని కక్కుర్తి చూడండి..

‘‘ఊపిరి ఉంటే.. ఉప్పు అమ్మి అయినా బతకొచ్చు’’. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఈ సామెతను గుర్తు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రాణాపాయం అని తెలిస్తే ఎవరూ ఎలాంటి సాహసాలు చేయరు. కానీ కొందరు మాత్రం తెగించి ధైర్యం చేస్తుంటారు. మరికొందరైతే కక్కుర్తి కోసం చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని సార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి నవ్వు తెప్పించే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం వచ్చి అంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీస్తుంటే.. మందు బాటిళ్ల కోసం ఓ వ్యక్తి కక్కుర్తి చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఇటీవల టర్కీలో భూకంపం (Turkey earthquake) కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీతో (Delhi) పాటూ పలు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సాధారణంగా భూకంపం అని అనగానే ఎవరైనా ముందు ఇళ్ల నుంచి బయటికి పారిపోవడం మామూలే. అయితే ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చేసిన కక్కుర్తి పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. భూకంపం అని తెలియడంతో ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ‘‘వామ్మో! భూకంపం బాబోయ్.. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి’’.. అంతా అరుస్తూ పరుగులు తీస్తున్నారు.

Viral Video: మండుతున్న పెనం మీద కూర్చుని ఆశీర్వదిస్తున్న బాబా.. విషయం వారికి తెలియడంతో.. చివరికి..

అంతా ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెడుతుంటే.. ఓ వ్యక్తికి మాత్రం ఇంట్లోని మందు బాటిళ్లు (Liquor bottles) గుర్తుకొచ్చాయి. ప్రాణాలు పోతే పోనీ.. నా మందు బాటిళ్లను మాత్రం కాపాడుకోవాలి.. అనుకున్నాడో ఏమోగానీ.. పరుగు పరుగున అక్కడికి వెళ్లాడు. అప్పటికే ఇల్లు మొత్తం కంపిస్తుండడంతో బాటిళ్లు కింద పడే స్థితిలో ఉన్నాయి. పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లిన సదరు వ్యక్తి.. బాటిళ్లు కింద పడుకుండా చేతుల్లో జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇలా భూకంపం ఆగే వరకూ అక్కడే ఉండి బాటిళ్లు కిందపడకుండా చూసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు (Funny comments) ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T16:16:32+05:30 IST