విషం పనిచేయకుంటే.. వెంటనే ఉరేసుకోమంటూ ప్రియుడికి సలహా.. ఆమె ఎందుకు ఇలా చేసిందా అని ఆరాతీయగా..

ABN , First Publish Date - 2023-03-25T19:52:53+05:30 IST

ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా యువతులో మోసపోతుంటారు. కొంతమంది యువకులు మాయ మాటలు చెబుతూ యువతులను మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరైతే దారుణాలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు..

విషం పనిచేయకుంటే.. వెంటనే ఉరేసుకోమంటూ ప్రియుడికి సలహా.. ఆమె ఎందుకు ఇలా చేసిందా అని ఆరాతీయగా..

ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా యువతులో మోసపోతుంటారు. కొంతమంది యువకులు మాయ మాటలు చెబుతూ యువతులను మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరైతే దారుణాలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు విచిత్రంగా యువతులు కూడా క్రూరంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. విషం పని చేయకుంటే.. వెంటనే ఉరేసుకోమంటూ.. ఓ యువతి తన ప్రియడికి సలహా ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఎటాహ్ పరిధి హత్రాస్ ప్రాంతానికి చెందిన అంకిత్ కుమార్ అనే యువకుడికి కొన్ని నెలల క్రితం .. స్థానిక నారాయణ్ నగర్ ప్రాంతానికి చెందిన చిత్ర అనే యువతితో (young woman) పరిచయం ఏర్పడింది. పరిచయమైన కొన్నాళ్లకే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమకు దారి తీసింది. చాలా కాలంగా వీరిద్దరూ (love) ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం వీరి కుటుంబ సభ్యులకు తెలీకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral Video: ఆశ్చర్యం.. జలకాలాడుతున్న ఈ జంట.. శాండ్‌విచ్‌ చూపించగానే మొసలి ఏం చేసిందంటే..

ఎట్టి పరిస్థితుల్లో తాము చెప్పిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని కండీషన్ పెట్టారు. ఈ క్రమంలో బులంద్‌షహార్ ప్రాంతానికి చెందిన హేమంత్ అనే యువకుడికి ఇచ్చి వివాహం (marriage) జరిపించారు. అయినా చిత్ర తరచూ తన ప్రియుడిని కలుస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఈ విషయం చిత్ర అమిత్‌కు తెలిసి.. ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు. దీంతో అప్పటి నుంచి చిత్ర తన ప్రియుడికి దూరంగా ఉండేది. ఎలాగైనా అంకిత్‌ను వదిలించుకోవాలని ఆలోచిస్తూ ఉండేది. ఇటీవల ప్రియుడు పిలవడంతో స్థానికంగా ఉన్న బస్టాండ్ వద్దకు వెళ్లింది. అక్కడ కొద్ది సేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.

Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

మధ్యలో కూల్‌డ్రింక్‌లో విషం (Poison cooldrink) కలిపి ప్రియుడికి ఇచ్చిం.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయిది. కూల్‌డ్రింక్‌ తాగిన అంకిత్.. తర్వాత బస్సు ఎక్కి తన గ్రామానికి బయలుదేరాడు. మధ్యలో ప్రియుడికి ఫోన్ చేసిన చిత్ర.. ‘‘కూల్‌డ్రింక్‌‌లో విషం కలిపి ఇచ్చాను.. ఒకవేళ అది పని చేయకపోతే ఉరి వేసుకుని చచ్చిపో’’.. అని చెప్పింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లాడు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుడి ఫోన్‌లోని కాల్ రికార్డింగ్ (Call recording) ఆధారంగా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-25T19:52:53+05:30 IST