Viral Video: ఆశ్చర్యం.. జలకాలాడుతున్న ఈ జంట.. శాండ్‌విచ్‌ చూపించగానే మొసలి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-25T17:45:14+05:30 IST

పులులు, సింహాలు, మొసళ్లతో చెలగాటం ఆడాలని ఎవరైనా అనుకుంటారా.. అంటే వామ్మో! చచ్చినా అనుకోరు.. అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాటితో చెలగాటం కాదు.. కనీసం కంటపడినా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే..

Viral Video: ఆశ్చర్యం.. జలకాలాడుతున్న ఈ జంట.. శాండ్‌విచ్‌ చూపించగానే మొసలి ఏం చేసిందంటే..

పులులు, సింహాలు, మొసళ్లతో చెలగాటం ఆడాలని ఎవరైనా అనుకుంటారా.. అంటే వామ్మో! చచ్చినా అనుకోరు.. అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాటితో చెలగాటం కాదు.. కనీసం కంటపడినా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొందరు మాత్రం ఇందుకు విరుద్ధంగా వాటితో చిన్నపిల్లల మాదిరి ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ విచిత్రమైన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జలకాలాడుతున్న ఓ జంట.. శాండ్‌విచ్‌ చూపించగానే మొసలి ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో మొసలికి సంబంధించిన ఓ వీడియో (Crocodile viral videos) తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలో (Florida) ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు (couple) కలిసి నీటిలో జలకాలాడేందుకు వెళ్తారు. ఈ క్రమంలో నీటిలో కూర్చుని శాండ్‌విజ్ తింటూ సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఉంటారు. ఈ క్రమంలో దూరంగా ఓ మొసలి (crocodile) ఉండడాన్ని గమనిస్తారు. తర్వాత అతను తన భార్య చేతిలో ఉన్న శాండ్‌విచ్ (Sandwich) నుంచి ఓ ముక్కను తీసుకుంటాడు. ఆ ముక్కను చూపిస్తూ.. మొసలికి సైగ చేస్తాడు. అలా సైగలు చేసిన కాసేపటికి మొసలి గమనిస్తుంది. నేరుగా వారి వద్దకు వస్తుంది. దగ్గరికి వచ్చిన మొసలి తలపై ప్రేమగా ఓ దెబ్బ వేస్తాడు తర్వాత శాండ్‌విచ్ ముక్కను దాని నోట్లో పెడతాడు.

Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

అంతగా ఇబ్బంది పెట్టినా మొసలి మాత్రం బుద్ధిగా అతడు పెట్టిన చిన్న ముక్కను టేస్ట్ చేస్తూ.. ‘‘ఓహో!!.. ఈ శాండ్‌విచ్ ఎంత బాగుంది’’.. అనుకుంటున్నట్లుగా నములుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మళ్లీ పిలిచేందుకు ప్రయత్నించినా వారి వద్దకు రాకుండా వెళ్లిపోతుంది. చివరగా అతను మరో శాండ్‌విచ్ ముక్కను మొసలి వైపు విసిరేస్తాడు. మనుషలు, జంతువుల ఇలా ఎవరు కనిపించినా దాడి చేసే మొసలి.. అందుకు విరుద్ధంగా ఇలా శాండ్‌విచ్‌తో సరిపెట్టుకోవడం చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘మొసలితో మజాక్ చేస్తే.. మొదటికే మోసం వస్తుంది’’.. అని కొందరు, మొసలినే శాఖాహారిగా మార్చేశావేంట్రా బాబూ.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-25T17:45:14+05:30 IST