Viral Video: ఓరి నాయనో!.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో.. ఈ దొంగ తన కారును ఏకంగా గాల్లోనే..

ABN , First Publish Date - 2023-03-26T17:38:47+05:30 IST

సినిమాల్లో కోట్లు ఖర్చు చేసి మరీ కొన్ని విన్యాసాలకు సంబంధించిన గ్రాఫిక్ సీన్లను తీస్తుంటారు. అయితే ఎలాంటి మాయాజాలం, పైసా ఖర్చు లేకుండానే నిజ జీవితంలోనూ అలాంటి విన్యాసాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటివి..

Viral Video: ఓరి నాయనో!.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో.. ఈ దొంగ తన కారును ఏకంగా గాల్లోనే..

సినిమాల్లో కోట్లు ఖర్చు చేసి మరీ కొన్ని విన్యాసాలకు (stunts) సంబంధించిన గ్రాఫిక్ సీన్లను తీస్తుంటారు. అయితే ఎలాంటి మాయాజాలం, పైసా ఖర్చు లేకుండానే నిజ జీవితంలోనూ అలాంటి విన్యాసాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇది నిజమా లేక ఏదైనా ఇంద్రజాలమా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కారులో ఏకంగా గాల్లోకి ఎగిరిస్తాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ విన్యాసానికి సంబంధించిన వీడియో (Viral videos) వైరల్ అవుతోంది. దొంగను పట్టుకునేందుకు పోలీసులు కారులో వెంబడిస్తూ (Car chasing) ఉంటారు. ఈ క్రమంలో ఎదరుగా దొంగ వస్తున్న మార్గంలో ఎదురుగా కారు నిలుపుకొని ఉంటారు. పోలీసు కారు (police car) చూడగానే ఎదురుగా వేగంగా వస్తున్న దొంగ (thief) అరెస్ట్ అవుతాడు. రోడ్డుకు పక్కన అండర్‌గ్రౌండ్ మార్గం ఉంటుంది. ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో దొంగ తన కారును రోడ్డు పక్కన (Car Stunt) గాల్లోకి ఎగిరిస్తాడు. అదే సమయంలో అండర్‌గ్రౌండ్ రహదారిలో ఓ కంటైనర్ వెళ్తూ ఉంటుంది.

Viral Video: భూకంపం వచ్చి అంతా ఇళ్ల నుంచి బయటికి పారిపోతుంటే.. మందు బాటిళ్ల కోసం ఇతని కక్కుర్తి చూడండి..

గాల్లోకి లేచిన కారు కంటైనర్ మీద నుంచి అటుపక్కన ఉన్న మరో మార్గం పైకి దూసుకెళ్తుంది. ఆ మార్గంలో వెళ్తున్న బస్సు (bus) పైన దూకి అటు నుంచి అటే పక్కన ఉన్న రోడ్డుపైకి ల్యాండ్ అవుతుంది. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగి ఉన్నా పెద్ద ప్రమాదం జరిగుండేది. కానీ ఏ చిన్న ప్రమాదం జరగకుండా దొంగ చాకచక్యంగా తప్పించుకోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా.. అని కొందరు, ఇలాంటి సీన్లు సినిమాల్లోనూ అసాధ్యం.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T17:38:47+05:30 IST