ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన బాలిక.. బాత్రూంకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో.. అనుమానం వచ్చి కంగారుగా వెళ్లి చూడగా..

ABN, First Publish Date - 2023-11-16T21:05:34+05:30

కొందరు సవ్యంగా సాగుతున్న జీవితంలో చేజేతులా సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. తెలిసి కొందరు, తెలీక ఇంకొందరు చివరకు దారుణంగా మోసపోతుంటారు. మహిళల విషయంలో...

ప్రతీకాత్మక చిత్రం

కొందరు సవ్యంగా సాగుతున్న జీవితంలో చేజేతులా సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. తెలిసి కొందరు, తెలీక ఇంకొందరు చివరకు దారుణంగా మోసపోతుంటారు. మహిళల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన బాలిక.. కొద్దిసేపటికి తర్వాత బాత్రూంలోకి వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా లోపలికి వెళ్లారు. చివరకు అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హత్రాస్ జిల్లాలోని హత్రాస్ గేట్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన బాలిక (girl) పదో తరగతి చదువుతోంది. ఇదిలావుండగా, ఇటీవల బాలికకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంట్లో తెలీకుండా కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో ఇటీవల ఉన్నట్టుండి బాలికకు కడుపు నొప్పి (stomach ache) వచ్చింది. చూస్తుండగానే నొప్పి ఎక్కువకావడంతో ఏడుస్తూ కూర్చుంది. కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Viral Video: ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది.. కుక్కను పట్టుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా..

డాక్టర్ల పరీక్షిస్తుండగానే.. విరోచనాల కారణంగా బాత్రూం వెళ్లింది. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికి (girl gave birth baby) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎంతకీ ఆమె బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. లోపలికి చూశారు. కూతురిని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యారు. బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆమెను అక్కడే విడిచిపెట్టి ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే బాలికను గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: రైల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డతో కనిపించిన మహిళ.. విషయం ఏంటా అని ఆరా తీయగా.. షాకింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-11-16T21:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising