ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coconut Bondas: వామ్మో.. బోండాం.. ధర అమాంతం పెరిగిందిగా..

ABN, First Publish Date - 2023-04-26T13:13:49+05:30

కొబ్బరి బోండాల(Coconut Bondas) ధరలు ఆకాశన్నంటాయి. వేసవి కావడంతో కొబ్బరి నీళ్ళకు అమాంతం డిమాండ్‌ పెరిగింది.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కొబ్బరి బోండాల(Coconut Bondas) ధరలు ఆకాశన్నంటాయి. శాసనసభ ఎన్నికల తరుణంలో వివిధ పార్టీల ర్యాలీలలో పాల్గొంటున్న కార్యకర్తలు మండుటెండలో కొబ్బరినీళ్ళతో తమ దాహార్తి తీర్చుకుంటున్నారు. పైగా వేసవి కావడంతో కొబ్బరి నీళ్ళకు అమాంతం డిమాండ్‌ పెరగడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెలలో ఒక్కోటి రూ.30 నుంచి 35 ధర పలికిన కొబ్బరిబొండాం ఇప్పుడు రూ.40 నుంచి రూ.50వరకు పలుకుతోంది. డిమాండ్‌ తగ్గట్లు కొబ్బరిబొండాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల హెక్టార్ల ప్రదేశంలో కొబ్బరితోటలను పండిస్తున్నారు. ఇందులో 15 శాతం కొబ్బరిబొండాలుగానే వినియోగిస్తారు. బెంగళూరు గ్రామీణ జిల్లాతో పాటు మండ్య, తుమకూరు, మైసూరు(Mysore) జిల్లాల్లో కొబ్బరితోటలు అధికంగా ఉన్నాయి. ఎండలు తగ్గేంతవరకు అంటే మే నెల రెండోవారం వరకు కొబ్బరి బొండాలకు డిమాండ్‌ ఇలాగే ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2023-04-26T13:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising