AP Politics: సీఎం జగన్.. కొంచెం వాళ్లను చూసి నేర్చుకోండి..!!
ABN, First Publish Date - 2023-07-24T13:38:42+05:30
అమరావతి పరిధిలో ఈరోజు సీఎం జగన్ పర్యటనకు దాదాపు రూ.9 కోట్ల ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగా రూ.9 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతుందా అన్న విషయాన్ని పక్కనపెడితే.. సుమారు 25 కి.మీ పర్యటనకు హెలికాప్టర్ వాడటం అవసరమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి పబ్బం గడుపుకుంటున్న సీఎం జగన్ ఇలా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లో కొందరు సాధారణ జీవితం అనుభవిస్తుంటే.. మరికొందరు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరిలో ఏపీ సీఎం జగన్ (CM Jagan Mohan Reddy) రెండో కేటగిరీకి చెందుతారు. ఎందుకంటే రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నానని తన మీడియాలో డప్పు కొట్టుకునే సీఎం జగన్.. మరోవైపు ప్రభుత్వ నిధులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుపెడుతూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈరోజు సీఎం అమరావతి (Amaravathi) పర్యటనే దీనికి ప్రత్యేక ఉదాహరణ. తాడేపల్లి ప్యాలెస్ నుంచి 9 కి.మీ కూడా లేని కృష్ణాయపాలెం గ్రామానికి సీఎం జగన్ హెలికాప్టర్ (Helicopter) వాడారు. రాను పోను 18 కి.మీ ఉన్న దూరానికి రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేసి ఏకంగా కోట్లకు కోట్లు ఖర్చుపెడుతూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు.
అమరావతి పరిధిలో ఈరోజు సీఎం జగన్ పర్యటనకు దాదాపు రూ.9 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగా రూ.9 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతుందా అన్న విషయాన్ని పక్కనపెడితే.. సుమారు 25 కి.మీ పర్యటనకు హెలికాప్టర్ వాడటం అవసరమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అసలే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి పబ్బం గడుపుకుంటున్న సీఎం జగన్ ఇలా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోటు బడ్జెట్ కారణంగా ప్రతినెలా ఆర్‌బీఐ దగ్గర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు తెస్తోంది. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. వాయిదాల పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాజధాని నిర్మాణానికి నిధులు కరువయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఇస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని జగన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అయినా చీమ కుట్టినట్లు కూడా లేని జగన్ ధనిక సీఎం మాదిరిగా 9 కి.మీ. దూరానికి కాన్వాయ్ కాకుండా హెలికాప్టర్ వాడటం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
వీళ్లను చూసి నేర్చుకో జగన్..!!
రాజకీయాల్లో సాధారణ జీవితం గడిపిన వారిలో సీపీఐ నేత గుమ్మడి నరసయ్య ముందుంటారు. ఉమ్మడి ఏపీలో గతంలో ఐదుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు. ఆయన 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గుమ్మడి నరసయ్య తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ హంగులు, ఆర్భాటాలకు తావులేకుండా జీవించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ కూడా ఆయన సాధారణ జీవితం గడుపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. అటు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పలు సందర్భాల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇతర రాజకీయ నేతల తరహాలో కాకుండా ఎమ్మెల్యే సీతక్క చాలా సింపుల్‌గా, ఆర్భాటాలు లేకుండా కనిపిస్తుంటారు. అలాగే దేశ అత్యున్నత పదవిని చేపట్టి రాష్ట్రపతిగా సేవలు అందించిన మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కూడా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఇంట్లో టీవీ కూడా వాడేవాళ్లు కాదు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం రెండు జతల డ్రస్‌లు మాత్రమే వాడేవాళ్లు అని ప్రచారం జరిగింది. ఇటువంటి నేతలను జగన్ ఆదర్శంగా తీసుకోలేరా అని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఎలాగో 2024లో ఓడిపోతారు కాబట్టి అనుభవించేదేదో ఇప్పుడే అనుభవించేద్దాం అన్న తరహాలో జగన్ వ్యవరిస్తున్నారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Fact Check: వైసీపీ సర్కారు చీప్ ట్రిక్స్.. అబద్ధపు ప్రచారమే వాళ్ల పని..!!
*******************************************************************************************
Nara Lokesh: జగన్‌పై నారా లోకేష్ సెటైర్.. మాములుగా లేదుగా..!!
******************************************************************************************
Jagan Mohan Reddy: అయ్యా జగన్.. సీఎం స్థాయిలో ఇలాగేనా మాట్లాడేది?
Updated Date - 2023-07-24T13:38:42+05:30 IST