Fact Check: వైసీపీ సర్కారు చీప్ ట్రిక్స్.. అబద్ధపు ప్రచారమే వాళ్ల పని..!!

ABN , First Publish Date - 2023-07-22T14:20:15+05:30 IST

సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రీతిలో పేట్రేగిపోతున్నారు. వాళ్లకు ఇష్టం లేని వాళ్లను బండబూతులు తిడుతూ కట్టుకథలు సృష్టిస్తూ అవే నిజాలని ప్రజలను నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత దౌర్జన్యం చేశారని.. అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్న రీతిలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.

Fact Check: వైసీపీ సర్కారు చీప్ ట్రిక్స్.. అబద్ధపు ప్రచారమే వాళ్ల పని..!!

జగన్ (Jagan) నేతృత్వంలోని వైసీపీ సర్కారు (YCP Government) అమలు చేస్తున్న చీప్ ట్రిక్స్‌కు హద్దు, అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియా(Social Media)లో వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రీతిలో పేట్రేగిపోతున్నారు. వాళ్లకు ఇష్టం లేని వాళ్లను బండబూతులు తిడుతూ కట్టుకథలు సృష్టిస్తూ అవే నిజాలని ప్రజలను నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందన్న విషయం సుస్పష్టం. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఆంధ్రజ్యోతి(Andhra Jyothy)ని అడ్డం పెట్టుకుని ఓ కట్టుకథ అల్లింది.

WhatsApp Image 2023-07-22 at 1.15.39 PM.jpeg

జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత దౌర్జన్యం చేశారని.. అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్న రీతిలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా అనిత తీరు టీడీపీలో పెద్దలకు గిట్టడం లేదని ప్రజలను నమ్మించేందుకు విఫల ప్రయత్నం చేసింది. అయితే ఈ కథనాన్ని పూర్తిగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఖండించింది. ఇది పూర్తిగా వైసీపీ నేతలు సృష్టించిందేనని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: జగన్‌పై నారా లోకేష్ సెటైర్.. మాములుగా లేదుగా..!!

కాగా ఏపీలో మహిళలపై దాడులను నిరసిస్తూ శుక్రవారం నాడు టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలుు మిస్సింగ్, మహిళలపై దాడులు, వేధింపులు.. మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆమె మండిపడ్డారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా పోస్టులు పెట్టి మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితపై కక్షపూరితంగా వ్యవహరించాలని కుట్ర పన్ని వైసీపీ దుష్ప్రచారానికి పాల్పడుతోంది. ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకుని ఓ కట్టుకథను సృష్టించింది.

Updated Date - 2023-07-22T14:20:15+05:30 IST