Jagan Mohan Reddy: అయ్యా జగన్.. సీఎం స్థాయిలో ఇలాగేనా మాట్లాడేది?

ABN , First Publish Date - 2023-07-21T15:37:26+05:30 IST

వెంకటగిరిలో జగన్ మాట్లాడిన మాటలను గమనిస్తే ఆయన ఫస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ఆరోపణలు చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం.. క్యారెక్టర్‌ను కించపరిచేలా వ్యా్ఖ్యానించడం జగన్‌కే చెల్లిందని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లాల గురించి మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.

Jagan Mohan Reddy: అయ్యా జగన్.. సీఎం స్థాయిలో ఇలాగేనా మాట్లాడేది?

ఏపీ సీఎం జగన్‌ (Jagan) వ్యవహారశైలిలో భారీగా మార్పు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయనలో ఫస్ట్రేషన్ (Fustration) తారా స్థాయికి చేరుతోంది. దానికి ప్రధాన ఉదాహరణ ఈరోజు వెంకటగిరి సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు అని సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్‌లు స్పష్టం చేస్తున్నారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని నెటిజన్‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. నేరుగా పేర్లను ప్రస్తావించే ధైర్యం లేని జగన్ ఫస్ట్రేషన్‌లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం దౌర్భాగ్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడం బటన్ నొక్కుడు సీఎంకు అలవాటుగా మారిందని నెటిజన్‌లు ఎద్దేవా చేస్తున్నారు.


అసలు జగన్‌కు ఎందుకింత ఫస్ట్రేషన్?

వెంకటగిరిలో జగన్ మాట్లాడిన మాటలను గమనిస్తే ఆయన ఫస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ఆరోపణలు చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం.. క్యారెక్టర్‌ను కించపరిచేలా వ్యా్ఖ్యానించడం జగన్‌కే చెల్లిందని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లాల గురించి మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారని జనసేన అభిమానులు ఫైర్ అవుతున్నారు.


అటు వివేకా హత్య కేసులో సోదరుడు అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ స్పష్టం చేసిన సమయంలో ఏం చేయాలో తెలియక జగన్ ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో రాజకీయ కుట్ర ఉందని స్వయంగా తన సోదరి షర్మిల కూడా ఆరోపణలు చేయడంతో జగన్ ఇరకాటంలో పడ్డారని.. అందుకే ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారేలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమంటున్నారు. వాలంటీర్ల గురించి గొప్పలు చెప్పుకునే జగన్.. వెంకటగిరి సభకు ముందు వాళ్లకు గోతాలు ఇచ్చి రోడ్లపై చెత్త ఎత్తించాడని పలువురు మండిపడుతున్నారు. అలాంటి జగన్ తమ నాయకుడి గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని అటు టీడీపీ.. ఇటు జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండటం, ప్రభుత్వ తీరుపై ఆరోపణలు వస్తుండటంతోనే జగన్‌లో ఫస్ట్రేషన్ కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Pattiseema: జగన్ సర్కారు నోట.. చంద్రబాబు ప్రాజెక్టు మాట..!!

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

Updated Date - 2023-07-21T15:38:34+05:30 IST