ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : బాలినేని స్థానంలో కీలక నేతను గట్టిగానే ప్లాన్ చేసిన వైఎస్ జగన్.. అంతా ఓకే గానీ వైవీ ఒప్పుకుంటారా..!?

ABN, First Publish Date - 2023-05-17T12:50:33+05:30

బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) వైఎస్ జగన్ ప్లాన్ (YS Jagan Plan) చేశారా..? రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్‌గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందా..? ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) వైఎస్ జగన్ ప్లాన్ (YS Jagan Plan) చేశారా..? రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్‌గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందా..? అంటే వైసీపీ వర్గాల్లో (YSRCP) , వైసీపీ సోషల్ మీడియాలో (YSRCP Social Media) జరిగే ప్రచారాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు..? ఆయన్నే జగన్ ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఇదీ అసలు కథ..

సీఎం వైఎస్ జగన్ రెడ్డి సమీప బంధువైన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ప్రకాశం (Prakasam), నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittor) జిల్లాల కో-ఆర్డినేటర్‌గా (Co-Ordinator) బాలినేని రాజీనామా (Balineni Res) చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ మొదలెట్టేశారని వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ రూమర్స్‌కే పరిమితం అయ్యాయి. అలా వార్తలు వచ్చిన మరుసటిరోజే బాలినేని ఫ్లెక్సీలో వైఎస్ జగన్‌తో పాటు జిల్లా మంత్రులు ఎవరి ఫొటోలు కనిపించపోవడం.. కార్యకర్తలను జగన్ సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో బాలినేని ఇంకా కూల్ అవ్వలేదని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. అయితే.. బాలినేని రాజీనామా చేసిన కో-ఆర్డినేటర్ పదవికి వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని (YSRCP MP Vijayasai Reddy) సెలక్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ జగన్‌ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి మొదటి వ్యక్తని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. పైగా రాజకీయంగా ఆయనకు అపార అనుభవమే ఉందని.. వీటన్నింటికీ మించి ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా కలిగి ఉన్న నేత అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నారట. ఇప్పటికే వైసీపీలోని పెద్దలతో జగన్ ఇదే విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు విజయసాయికి సమాచారం ఇవ్వడం.. ఇటు అధికారిక ప్రకటన రెండూ ఒకే రోజు జరిగిపోతాయట.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

వాస్తవానికి విజయసాయిరెడ్డి చాలా రోజులు వైసీపీలో యాక్టివ్‌గా లేరన్నది జగమెరిగిన సత్యమే. నందమూరి తారకరత్న ఆస్పత్రిలో ఉన్నది మొదలుకుని ఆయన తుదిశ్వాస విడిచేవరకూ నందమూరి, నారా కుటుంబాలతో (Nandamuri-Nara Family) కలిసి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆ తర్వాత తారకరత్నను కడసారి చూడటానికి వచ్చిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలయ్యతో కలివిడిగా ఉండటాన్ని వైసీపీ రుచించుకోలేకపోయింది. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి.. సాయిరెడ్డికి భార్య చెల్లెలి కుమార్తే. అందుకే దగ్గరుండి అన్నీ చూసుకున్నారాయన. సరిగ్గా అప్పుడే సాయిరెడ్డి దగ్గరన్న ఒకట్రెండు పదవులను తీసేసి మరీ వైసీపీ హైకమాండ్ ఓవరాక్షన్ చేసిందని ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి వరకూ విజయసాయిరెడ్డి రేంజ్‌ వేరు.. ఆ తర్వాత పరిస్థితి వేరుగా మారిపోయింది. అప్పటికే ఆయన్ను వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి తప్పించగా.. ఈ ఘటనతో అనుబంధ సంఘాల అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించడంతో సాయిరెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుమారుడు భార్గవ్ రెడ్డికి (Sajjala Bhargav Reddy).. అనుబంధ సంఘాల బాధ్యతలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Chevireddy Bhasakar Reddy) జగన్ కట్టబెట్టారు.

కూల్ అవుతారా.. ఆయన ఒప్పుకుంటారా..!?

ఇన్ని రోజులూ ఉన్న పదవులన్నీ పీకేసి మరీ ఖాళీగా కూర్చొబెట్టిన విజయసాయిరెడ్డికి ఈ పదవి ఇస్తే కాస్త ఆయన శాంతిస్తారని జగన్ భావిస్తున్నారట. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడానికి వీల్లేకుండా ఢిల్లీకే ఇన్నిరోజులు పరిమితం చేసిన జగన్.. ఇప్పుడు సాయిరెడ్డిని కూల్ చేయడానికి ఇలా కో-ఆర్డినేటర్ పదవి కట్టబెడుతున్నారట. అది కూడా ఏపీలో కీలకంగా ఉండే జిల్లాలు కావడం.. ఇది పెద్ద బరువు బాధ్యతలే కావడంతో కచ్చితంగా ఆయన అంగీకరించి తీరుతారని జగన్ అనుకుంటున్నారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విజయసాయిరెడ్డి ఒక్కసారి ఎంటరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) హవాకు కచ్చితంగా చెక్ పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. వైవీ కూడా విజయసాయి మాట విని తీరాల్సిందే.. అలాంటిది ఆయన వింటారా..? ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ తిష్టవేసి చక్రం తిప్పుతానంటే వైవీ ఒప్పుకుంటారా..? అసలు ఇది అయ్యే పనేనా..? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

మొత్తానికి చూస్తే.. జగన్ గట్టిగానే ప్లాన్ చేశారు కానీ వర్కవుట్ అయ్యే పనేనా అనేది ఇప్పుడు వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. ఇదంతా ప్రపోజల్ స్టేజ్‌లోనే ఉందట.. ఒకవేళ ఈ కీలక బాధ్యతలకు విజయసాయి ఒప్పుకుంటే సరే లేకపోతే పరిస్థితేంటి..? ఒకవేళ ఒప్పుకోకుండా ఈ స్థానం ఎవరికో.. ఏమిటో అనేది తెలియాల్సి ఉంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AV vs Bhuma : ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ అఖిల ప్రియ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన మాజీ మంత్రి

******************************

AV Subbareddy Vs Akhila : లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గం దాడి.. తీవ్ర గాయాలు..

******************************

AV Subbareddy Vs Akhila Priya : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్.. భారీ బందోబస్తు..

*****************************

Updated Date - 2023-05-17T13:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising