AV vs Bhuma : ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ అఖిల ప్రియ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన మాజీ మంత్రి

ABN , First Publish Date - 2023-05-17T11:19:24+05:30 IST

నంద్యాలలో మంగళవారం నాడు జరిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..

AV vs Bhuma : ఏవీ సుబ్బారెడ్డి వర్సెస్ అఖిల ప్రియ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన మాజీ మంత్రి

నంద్యాలలో మంగళవారం నాడు జరిగిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) వర్సెస్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) ఎపిసోడ్‌లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. తాజాగా అసలేం జరిగింది..? ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది..? భార్గవ్‌రామ్‌పై కూడా పెట్టారా..? ఇలా అన్ని విషయాలపై అఖిల ప్రియ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘నిన్న కొత్తపల్లి దగ్గర పాదయాత్రలో నా భర్త భార్గవ్ రామ్ (Bhargav Ram) పాల్గొనలేదు. నా భర్తపై పోలీసులు కేసు పెట్టలేదు. భార్గవ్ రామ్ స్టేషన్‌కు నా వెంట వచ్చాడు అంతే. నిన్న జరిగిన నారా లోకేష్‌గారి పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి నా చున్నీ పట్టుకొని లాగాడు.. అప్పుడు నా డ్రెస్ చిరిగిపోయింది. చున్నీ ఎందుకు లాగావని అడిగితే ఏవీ సుబ్బారెడ్డి నన్ను దూషించాడు. అది చూసి నా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు’ అని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు.

AV-Subbareddy.jpg

అఖిల అరెస్ట్..

నిన్నటి ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఖాకీలు.. ఇవాళ ఉదయమే అఖిల ప్రియను (Bhuma Akhila Priya) అరెస్ట్ (Arrest) చేశారు. పాణ్యం పోలీస్ స్టేషన్‌కు మాజీమంత్రిని తరలించారు. భారీగా అభిమానులు, కార్యకర్తలు స్టేషన్‌ దగ్గరికి చేరుకున్నారు. మరోవైపు.. ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మొదటి వార్తలు వచ్చాయి కానీ అదంతా అవాస్తవమని అఖిల కొట్టిపారేశారు. మంగళవారం రాత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Naralokesh Yuvagalam Padayatra) టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిల ప్రియ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనపై నంద్యాల పోలీసులకు ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy) ఫిర్యాదు చేయగా యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏవీ సుబ్బారెడ్డి, ఆయన వర్గం.. అఖిల ప్రియతో పాటు మరో 11 మందిపై హత్యయత్నం కేసులు పెట్టారు. ఇవాళ ఉదయాన్నే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు.

bhuma.jpg

అసలేం జరిగింది..!?

కాగా.. అఖిల ఆదేశాలతోనే ఏవీపై దాడి జరిగిందని అటు నంద్యాల.. ఇటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా అసలేం జరిగిందనే దానిపై మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీనిపై స్పందించిన పోలీసులు అసలేం జరిగిందని ఆరాతీసి ఇవాళ ఉదయమే అఖిలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా.. అఖిల-ఏవీ వర్గాల మధ్య ఇప్పటికే పలుమార్లు గొడవలు జరిగాయి. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే భూమా బతికుండగా అన్నీ తానై చూసుకున్న ఏవీ.. ఆయన మరణాంతరం ఒక్కసారిగా రెండు కుటుంబాల మధ్య విబేధాలొచ్చాయి. నాటి నుంచి తాను రాజకీయాల్లోకి రావాలని ఏవీ ప్లాన్ చేసుకున్నారు.

అంతేకాదు.. అయితే నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని ఏవీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అఖిల ప్రియ వర్సెస్ ఏవీగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య ఎన్నిసార్లు గొడవలు జరిగాయో లెక్కలేదు. ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించి కేసులు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు వర్గాల వారు ఎక్కడ ఎదురుపడినా కొట్లాటలు.. ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా మాటల తూటాలు పేలుతున్నాయి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

AV Subbareddy Vs Akhila : లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గం దాడి.. తీవ్ర గాయాలు..

******************************

AV Subbareddy Vs Akhila Priya : మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్.. భారీ బందోబస్తు..

*****************************

Updated Date - 2023-05-17T17:19:30+05:30 IST