ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Girl: ఒమాన్‌లో విషాదం.. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కబళించిన రోడ్డు ప్రమాదం!

ABN, First Publish Date - 2023-08-04T09:44:31+05:30

గల్ఫ్ దేశం ఒమాన్‌ (Oman) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కారు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్‌ (Oman) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కారు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తల్లితో కలిసి స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. చనిపోయిన చిన్నారిని అల్నా టకిన్‌ (Alna Takin) గా గుర్తించారు. అక్కడి ఇండియన్ స్కూల్ అల్ సీబ్ (Indian School Al Seeb) లో ఆమె రెండో తరగతి చదువుతోంది. కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని పలారివట్టం చిన్నారి స్వస్థలం.

తల్లి భవ్యా వర్ఘీస్‌ తన ఇద్దరు పిల్లలను తీసుకుని అల్నాను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లింది. అలా చిన్నారి స్కూల్ నుంచి పీకాప్ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అల్నా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లి, ఇద్దరు తోబుట్టువులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో చిన్నారి స్వస్థలం పలారివట్టంలో విషాదం అలుముకుంది. అల్నా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

Updated Date - 2023-08-04T09:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising