ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abu Dhabi Big Ticket: ప్రవాసుడికి కలలో కూడా ఊహించనంత డబ్బు.. భారతీయులకు భారీ క్యాష్, కాస్ట్లీ గిఫ్ట్!

ABN, First Publish Date - 2023-02-04T10:42:10+05:30

Qatar Based Expat Wins Rs 51 Crore in Abu Dhabi Big Ticket Draw rams spl

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఖతార్‌లో (Qatar) ఉండే ఓ ప్రవాసుడికి తాజాగా నిర్వహించిన అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో (Abu Dhabi Big Ticket Draw) జాక్‌పాట్ తగిలింది. దాంతో అతడు కలలో కూడా ఊహించనంత నగదు గెలుచుకున్నాడు. నేపాల్‌కు చెందిన ప్రవాసుడు రంజిత్ కుమార్ పాల్‌ గత నెల 16వ తేదీన 248 సిరీస్‌లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కే ఈ జాక్‌పాట్ (Jackpot) తగిలింది. ఖతార్ రాజధాని దోహాలో (Doha) ఉండే రంజిత్ ఆన్‌లైన్‌లో కొన్న టికెట్ నం.232936 అతనికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాఫెల్ డ్రాలో విజేతగా నిలిచిన అతడు ఏకంగా 23 మిలియన్ల దిర్హమ్స్ (రూ.51.65కోట్లు) గెలుచుకున్నాడు.

ఇది కూడా చదవండి: హాంకాంగ్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఒక నెల రోజులు ఆగండి.. విమాన టికెట్‌కు రూపాయి పెట్టకుండా వెళ్లొచ్చు..!

దోహాలో గత ఏడేళ్లుగా నివాసం ఉంటున్న రంజిత్ 15 నెలల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నాడు. మరో 20 మంది స్నేహితులతో కలిసి అతడు ఇలా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన రంజిత్ స్థానికంగా ఉండే ఓ మనీ ఎక్స్ంఛేజ్ కంపెనీలో (Money Exchange Company) పని చేస్తున్నాడు. 'ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది మా జీవితాన్నే మార్చివేసే అద్భుత సంఘటన. ఈ నగదుతో స్వదేశానికి వెళ్లి పర్మినెంట్‌గా అక్కడే సెటిల్ అవుతా' అని రంజిత్ చెప్పాడు. ఇక ఇదే డ్రాలో భారత ప్రవాసులు (Indian Expats) కూడా పలు విలువైన బహుమతులు, భారీ మొత్తంలో క్యాష్ గెలుచుకున్నారు. విజేష్ విశ్వనాథన్ అనే భారతీయుడు 1మిలియన్ దిర్హమ్స్ (రూ.2.39కోట్లు) గెలుచుకోగా.. షిబూ మాథ్యువ్ అనే వ్యక్తి 1లక్ష దిర్హమ్స్ (రూ.22లక్షలు), అజిత్ రామచంద్రకైమల్ 50వేల దిర్హమ్స్ (రూ.11లక్షలు) గెలుచుకున్నారు. అలాగే సుమన్ ముత్తయ్య నడార్ రాఘవన్ అనే భారత ప్రవాసుడు న్యూ బ్రాండ్ రేంజ్ రోవర్ విన్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

Updated Date - 2023-02-04T10:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising