Bride: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

ABN , First Publish Date - 2023-02-02T13:56:50+05:30 IST

కొత్త కోడలు మెట్టినింటి వారికి కోలుకోని షాక్ ఇచ్చింది. పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి ఏకంగా ఆమె మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది.

Bride: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

ఇంటర్నెట్ డెస్క్: కొత్త కోడలు మెట్టినింటి వారికి కోలుకోని షాక్ ఇచ్చింది. పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి ఏకంగా ఆమె మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది. పెళ్లి (Marriage) తర్వాత భర్తతో కూడా ఆమె సఖ్యంగా మెలిగింది లేదు. కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా మాడ్లేది కాదు. కొత్త కదా.. అని వారు సర్దుకుపోయారు. కానీ, చివరకు ఇంత పని చేస్తుందని మాత్రం వారు ఊహించలేకపోయారు. ఆమె చేసిన నిర్వాహకానికి ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోని (Rajastan) అజ్మేర్‌లో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పూజ మార్గ్ ధోలభట్టాకు చెందిన హనుమాన్ ప్రసాద్ కుమారుడు జితేంద్ర. జితేంద్రకు పెళ్లి చేయాలని నిర్ణయించిన హనుమాన్ ప్రసాద్‌ బంధువు అయిన మున్నీ దేవీకి సంబంధాలు చూసి పెట్టమని అడిగాడు.

దాంతో ఆమె మదర్ గేట్‌కు చెందిన ఆశా జైన్, నిర్మల్ జైన్ అనే ఇద్దరిని హనుమాన్‌కు పరిచయం చేసింది. వారు ఇక్కడ లోకల్‌లో పిల్ల దొరకడం కష్టం తాము బయటి నుంచి తీసుకువస్తామని చెప్పారు. దీనికి అమ్మాయి తరపు వారికి రూ. 2లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని హనుమాన్‌తో బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత యూపీలోని (Uttar Pradesh) అలాహాబాద్‌కు చెందిన అర్చన దేవీ, నిర్మల దేవీ, సీతారం అనే ముగ్గురిని హనుమాన్ వద్దకు తీసుకొచ్చారు. అర్చన దేవీకి పెళ్లి (Wedding) కాలేదని ఆమెను జితేంద్రకు ఇచ్చి చేద్దామని చెప్పారు. అలాగే నిర్మల దేవీ, సీతారంను ఆమె తల్లిదండ్రులుగా పరిచయం చేశారు. అర్చన చూడడానికి బాగానే ఉండడంతో జితేంద్ర పెళ్లికి సరే అన్నాడు. దాంతో గతేడాది జూన్ 9న అర్చనతో జితేంద్రకు పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు తండ్రి హనుమాన్ నుంచి పెళ్లికూతురు (Bride) పేరెంట్స్ సీతారం, నిర్మల దేవీకి బంధువుల సమక్షంలోనే రూ.2లక్షలు ఇప్పించారు. ఆ తర్వాత వారు వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: కేంద్ర బడ్జెట్ గురించి చాలా మందికి తెలియని నిజాలివి..!

ఇక ఇంట్లో అడుగుపెట్టిన అర్చన దేవీ భర్తను దూరం పెట్టింది. కొత్త కదా.. మొదట్లో ఇలాగే ఉంటది అని జితేంద్ర సర్దుకుపోయాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఆమె సరిగ్గా మాట్లాడేది కాదు. ఇక కొత్త కోడలికి మామ హనుమాన్ నాలుగు తులాల బంగారం నగలు, అర్ధతులం తాళి, భారీ మొత్తంలో వెండి నగలు చేయించాడు. అలా అర్చన అత్తింట్లో ఎనిమిది రోజులు గడిపింది. జూన్ 18న జితేంద్ర పనిమీద బయటకు వెళ్లాడు. అలాగే ఇంట్లోని మిగతా సభ్యులు కూడా వారివారి పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో అర్చన మాత్రమే ఉంది. ఇదే అదునుగా భావించిన ఆమె ఇంట్లోని అల్మారాలో ఉన్న రూ.55వేల నగదు, లక్షల విలువ చేసే నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. తీరా ఇంటికి వచ్చి చూసిన జితేంద్రకు అర్చన కనిపించలేదు. చుట్టపక్కల ఇళ్లలో కూడా వాకాబు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు రావడంతో వారు కూడా అర్చన కోసం వెతికి చూశారు. కానీ, ఎక్కడ ఆమె జాడ దొరకలేదు.

ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్.. అదే జరిగితే చరిత్రలో నిలిచిపోతారు!

అనుమానం వచ్చి ఇంట్లోని అల్మారా వద్దకు వెళ్తే వారికి అసలు విషయం బోధపడింది. వెంటనే జితేంద్ర ఈ విషయమై ఆమెను తమ వద్దకు తీసుకువచ్చిన ఆశా జైన్, నిర్మల్ జైన్‌కు ఫోన్ చేశాడు. అప్పుడు వారు తమ అసలు రూపం బయటపెట్టారు. ఇదంతా తాము ఒక ముఠాగా ఏర్పడి చేసిన పనిగా చెప్పారు. మీ డబ్బులు కూడా అంతా ఖర్చుపెట్టేశామని, మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ ఫోన్ కట్ చేశారు. వారి మాటలు విన్న తర్వాత హనుమాన్‌కు గుండెపోటు వచ్చేసింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వినోద్ జైన్ అనే వ్యక్తి వారికి ఫోన్ చేశాడు. తాను అర్చనను తీసుకువస్తానని చెప్పి రూ.13వేలు తీసుకున్నాడు. కానీ, అతడు కూడా వారికి హ్యాండ్ ఇచ్చాడు. చివరకు చేసేదేమికలేక అక్టోబర్ 7న అల్వార్ గేట్ పోలీసులకు (Alwar Gate police station) జితేంద్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ, ఇప్పటివరకు పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈ పీఎస్‌కు కొత్త ఇంచార్జీగా శ్యామ్ సింగ్ చరణ్ బాధ్యతలు చేపట్టారు. దాంతో బాధితులు మరోసారి ఆయన వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతేగాక వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-02T13:58:36+05:30 IST