Bumper Offer: హాంకాంగ్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఒక నెల రోజులు ఆగండి.. విమాన టికెట్‌కు రూపాయి పెట్టకుండా వెళ్లొచ్చు..!

ABN , First Publish Date - 2023-02-03T12:00:11+05:30 IST

దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవల హాంకాంగ్ (Hong Kong) కరోనా ఆంక్షలను పూర్తిగా తొలగించింది.

Bumper Offer: హాంకాంగ్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఒక నెల రోజులు ఆగండి.. విమాన టికెట్‌కు రూపాయి పెట్టకుండా వెళ్లొచ్చు..!

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవల హాంకాంగ్ (Hong Kong) కరోనా ఆంక్షలను పూర్తిగా తొలగించింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఆంక్షలతో దెబ్బతిన్న పర్యాటక రంగానికి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 5లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఫ్రీగా విమాన టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఎగ్జిక్యూటి అధికారి జాన్ లీ (John Lee) గురువారం కీలక ప్రకటన చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం 'హాలో, హాంకాంగ్' ("Hello, Hong Kong")లో భాగంగా 5లక్షల మంది విదేశీ విజిటర్లకు (Overseas Visitors) ఉచిత విమాన టికెట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల ఓవర్సీస్ విజిటర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తిరిగి దేశానికి వస్తారని లీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని అమ్మాయిపై కోర్టులో కేసు.. నష్ట పరిహారంగా రూ.24కోట్లు డిమాండ్!

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ (Hong Kong Airlines), హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్ (Hong Kong Express), కాథీ పసిఫిక్ ఎయిర్‌లైన్స్ (Airlines Cathay Pacific) సంస్థలు ఈ టికెట్స్ ఇస్తాయని తెలిపారు. మరోవైపు స్థానికులకు కూడా ఇతర దేశాలకు వెళ్లేందుకు 80వేల ఉచిత టికెట్స్ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇక గతేడాది కేవలం 6లక్షల మంది మాత్రమే హాంకాంగ్‌ను విజిట్ చేశారట. గడిచిన మూడేళ్లలో 130 వరకు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను మూసివేశాయి. అలాగే 2022 ఒకే ఏడాదిలో 1.40లక్షల మంది విదేశీ కార్మికులు ఆ దేశ లేబర్ మార్కెట్ వదిలి వెళ్లారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏకంగా 3.5 శాతం మేర క్షీణించింది.

Updated Date - 2023-02-03T12:05:15+05:30 IST