ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: వామ్మో.. కువైత్ ప్రవాసులపై ఇలా పగ పట్టేసిందేంటి..!

ABN, First Publish Date - 2023-04-01T10:46:50+05:30

గడిచిన నాలుగైదేళ్లుగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏకంగా 3లక్షల డ్రైవింగ్ లైసెన్స్ తొలగించే యోచన..!

కువైత్ సిటీ: గడిచిన నాలుగైదేళ్లుగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రోజురోజుకు దేశంలో వలసదారుల ప్రాబల్యం పెరిగిపోతుండడంతో వారిని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల నిబంధనలను కఠినతరం చేసింది. దాంతో గత రెండేళ్లలో లక్షలాది మంది ప్రవాసులు (Kuwait) కువైత్‌ను విడిచి వెళ్లిపోయిన వైనం. ఇప్పుడు ప్రవాసుల విషయంలో కువైత్ మరో కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని సమాచారం. అదే.. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ ఉపసంహరణ (Withdraw of Expats Driving License). భారీ మొత్తంలో డ్రైవింగ్ లైసెన్లను తొలిగించే యోచనలో కువైత్ సర్కార్ ఉన్నట్లు అక్కడి ఓ మీడియా ఏజెన్సీ పేర్కొంది. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు 3లక్షల వరకు వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్ వెనక్కి తీసునుందని న్యూస్ ఏజెన్సీ తన నివేదిక ద్వారా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు ఉన్నతస్థాయి అధికారుల నుంచి కఠిన ఆదేశాలు అందాయని సమాచారం. యూనివర్సిటీ డిగ్రీ, కనీసం 600 కువైటీ దినార్లు (రూ.) జీతం లేని ప్రవాసులందరి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు కఠినమైన ఆదేశాలు ఇచ్చారని న్యూస్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. దీంతో ఆ దేశంలో భారీ సంఖ్యలో ఉండే ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కువైత్ సర్కార్ ఇలా వలసదారుల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. ఇదిలాఉంటే.. కువైత్‌కు (Kuwait) సంబంధించిన రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ నివేదిక (Kuwait Registration Census 2021 Project Report) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ దేశ మొత్తం జనాభా 43,85,717గా తేలింది. ఇందులో కువైటీలు (Kuwaitis) కేవలం 34శాతం మాత్రమే. అంటే సుమారుగా 14,88,718 అన్నమాట. అదే ప్రవాసుల (Expats) వాటా 66శాతం. ఇది 28,97,001కు సమానమని సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ (Central Statistical Administration) వెల్లడించింది.

ఇది కూడా చదవండి: యూఎస్-కెనడా బార్డర్‌లో విషాదకర ఘటన.. సరిహద్దు దాటుతూ 8మంది మృత్యువాత.. మృతుల్లో భారతీయ కుటుంబం..!

Updated Date - 2023-04-01T10:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising