Viral Video: ఏడుగురు చిన్నారులతో స్కూటీపై డేంజరస్ రైడ్.. పోలీసులు ఏం చేశారంటే..
ABN, First Publish Date - 2023-06-26T12:30:09+05:30
ద్విచక్ర వాహనంపై వాహనంపై సాధారణంగా ఇద్దరు వెళ్లడానికే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ముగ్గురు కూడా వెళ్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురు వెళ్లిన సందర్భాలను కూడా చూశాం. కానీ తాజాగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు పిల్లలతో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై: ద్విచక్ర వాహనంపై వాహనంపై సాధారణంగా ఇద్దరు వెళ్లడానికే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ముగ్గురు కూడా వెళ్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో నలుగురు వెళ్లిన సందర్భాలను కూడా చూశాం. కానీ తాజాగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు పిల్లలతో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో సదరు వ్యక్తికి హెల్మెట్ కూడా లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది ఈ ఘటన. ముంబైలో ఓ వ్యక్తి స్కూటీపై ఏడుగురు పిల్లలను ఎక్కించుకోని ప్రయాణించాడు.
ఈ ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి.. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేశాడు. అంతేకాకుండా ‘ఈ బాధ్యతారహితమైన వ్యక్తి స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో వెళ్తున్నాడు. ఏడుగురు చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టిన అతడిని వెంటనే అరెస్టు చేయాలి. ఈ పిల్లల తల్లిదండ్రులపై కూడా విచారణ జరపాలి.’ అని రాసి ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు.
సదరు వ్యక్తి చేసిన ట్వీట్‌కు స్పందించిన ముంబై పోలీసులు.. ఈ రైడర్ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడని, దీనిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 308 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. విచారణ జరిపి నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Updated Date - 2023-06-26T12:30:09+05:30 IST