ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Vs Congress : రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బ్లాస్టింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2023-03-16T12:10:04+05:30

దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒకే విధంగా ప్రవర్తిస్తాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) అన్నారు.

Kiren Rijiju, Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : దేశ వ్యతిరేక శక్తులన్నీ ఒకే విధంగా ప్రవర్తిస్తాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను రిజిజు ప్రస్తావించారు. దేశంలో, వెలుపల ఉన్న దేశ వ్యతిరేకులు మాట్లాడే మాటలనే రాహుల్ మాట్లాడారని చెప్పారు. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేదని, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు. భారత దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS) చొచ్చుకెళ్లాయన్నారు.

ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు గురువారం మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల విషయంలో ఎవరూ మౌనంగా ఉండలేరన్నారు. దేశానికి సంబంధించిన ఏ విషయమైనా అందరికీ ఆందోళనకరమైనదేనన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? వాటి ప్రభావం ఆయన పార్టీపై ఎలా ఉంటుంది? అనేవాటితో బీజేపీకి, ప్రభుత్వానికి సంబందం లేదన్నారు. ఆయన వల్ల ఆయన పార్టీ మునిగిపోయినా తమకు సంబంధం లేదన్నారు. అయితే దేశాన్ని కించపరచడానికి ఎవరినీ అనుమతించేది లేదని చెప్పారు. ఆయన దేశానికి హాని చేయాలనుకుంటే తాము మౌనంగా ఉండబోమని చెప్పారు.

రాహుల్ దేశాన్ని కించపరచలేదని, ఆయన క్షమాపణ చెప్పబోరని కాంగ్రెస్ చెప్తుండటంపై రిజిజు మాట్లాడుతూ, ఇది తీవ్ర విషయం కాదని కాంగ్రెస్ భావిస్తే, పార్లమెంటులో ఓ వర్గానికి ప్రాతినిధ్యంవహించేందుకు ఆ పార్టీవారు అర్హులు కాదన్నారు. దేశానికి సేవ చేసేందుకు గరిష్ఠ స్థాయిలో అవకాశం ఇచ్చిన భారతీయులకు కాంగ్రెస్‌వారు శాశ్వతంగా రుణపడి ఉండాలన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా విదేశాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై రిజిజు మాట్లాడుతూ, మోదీ విదేశాలకు వెళ్లినపుడు మన దేశాన్ని కించపరచలేదని, కేవలం ఆనాటి ప్రభుత్వం అవినీతిమయం అయిందని, అసమర్థంగా వ్యవహరిస్తోందని మాత్రమే చెప్పారన్నారు.

ఇవి కూడా చదవండి :

Parliament : పార్లమెంటుకు రాహుల్ గాంధీ?... క్షమాపణ చెప్పబోతున్నారా?...

Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...

Updated Date - 2023-03-16T12:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising