Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2023-03-16T10:12:18+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అంచెలంచెలుగా ఎదుగుతూ

Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...
Narendra Modi

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీ (Nobel Prize Comittee)కి కూడా చేరింది. అందులో ఆయనకు ఓ గొప్ప అభిమాని కూడా ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ఆయనే అతి పెద్ద పోటీదారు అని ఆ అభిమాని కుండ బద్దలు కొట్టారు.

నోబెల్ ప్రైజ్ కమిటీ భారత దేశంలో పర్యటిస్తోంది. ఈ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే (Asle Toje) బుధవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాను గొప్ప అభిమానినని వెల్లడించారు. నోబెల్ శాంతి బహుమతికి అతి పెద్ద పోటీదారు మోదీయేనని చెప్పారు. నేటి ప్రపంచంలో శాంతికి విశ్వసనీయ ప్రతిరూపం మోదీయేనని కొనియాడారు. భారత దేశం శాంతికాముక దేశమని, అది ఆ దేశానికి వారసత్వ సంపద అని కొనియాడారు.

మోదీ ఎంతో నమ్మదగిన నేత అని, యుద్ధాలు చేసుకునే దేశాల మధ్య యుద్ధాన్ని ఆయన ఆపగలరని అన్నారు. కేవలం ఆయన మాత్రమే యుద్ధాలను ఆపగలరని చెప్పారు. ప్రపంచంలోని నాయకుల్లో ప్రతి ఒక్కరూ శాంతి కోసం కృషి చేయాలన్నారు. నరేంద్ర మోదీ వంటి శక్తిమంతమైన నాయకుడికి ఆ సామర్థ్యం మరింత ఎక్కువగా ఉందన్నారు. భారత దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశాల్లో కూడా పాలుపంచుకునే నేత మోదీ అని ప్రశంసించారు.

మోదీ విధానాల వల్ల భారత దేశం సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని చెప్పారు. గొప్ప అర్హతగల నాయకుడైన ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే, అది చరిత్రాత్మకం అవుతుందని చెప్పారు.

అస్లే టోజే విద్యావేత్త, రచయిత. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లండ్, అమెరికాలలో పని చేశారు. ఓస్లో, ట్రామ్సే విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో మోదీ గత ఏడాది ముఖాముఖి మాట్లాడినపుడు సున్నితంగా ఓ హెచ్చరిక చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ‘‘ఇది యుద్ధాలు చేసే కాలం కాదు’’ అని మోదీ చెప్పడం గొప్ప సందేశాన్ని ఇవ్వడమే.

ఇవి కూడా చదవండి :

President: 18న కన్నియాకుమారికి రాష్ట్రపతి

Narendra Modi: 27న తమిళనాడులో ప్రధాని పర్యటన.. ముందుగా రామేశ్వరానికి.. ఆ తరువాత చెన్నైకి

Updated Date - 2023-03-16T13:32:39+05:30 IST