సర్కారులో ‘కర్నూలు కాక’

ABN , First Publish Date - 2022-11-23T02:18:09+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనపై రాజకీయ వేడి తగ్గలేదు.

సర్కారులో ‘కర్నూలు కాక’

పోటెత్తిన జనంపై ఆరాలో ఇంటెలిజెన్స్‌ బిజీ

ఐదురోజుల తర్వాతా బాబు పర్యటనపై తగ్గని వేడి

రోడ్‌షో, బాదుడే బాదుడు సభలకు 4 లక్షలమంది

జగన్‌ ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదిక?

5,6 లక్షల మంది వచ్చారన్న రాజకీయ విశ్లేషకులు

బాబు కోసం వచ్చారా? ప్రభుత్వం నచ్చక పోటెత్తారా?

ఏయే వర్గాల నుంచి వచ్చారు? నిఘా వర్గాల ఆరా

కర్నూలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనపై రాజకీయ వేడి తగ్గలేదు. బాబు రోడ్‌షో, బాదుడే బాదుడు సభలు అదుర్స్‌ అన్నట్లుగా తరలివచ్చిన జనసునామీపై ప్రభుత్వ వర్గాలు, రాజకీయ వర్గాలు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహించిన చోట...రహదారికి ఇరువైపులా ఉండే కాలనీల జనం, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, టీడీపీ శ్రేణులు.. ఇలా మొత్తంగా 4.5 లక్షలకుపైగా ప్రజలు మమేకమై ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని సర్కారుకు నివేదించినట్టు సమాచారం. అయితే.. 5 లక్షల నుంచి 6 లక్షలకు పైగా ప్రజలు వచ్చి ఉండవచ్చని టీడీపీ ముఖ్య నాయకులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

‘నవరత్నాలు పేరిట వివిధ పథకాల ద్వా రా ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తున్నాం.. చంద్రబా బు పర్యటనకు వెళ్లవద్దని గ్రామాల్లో వలంటీర్లు ఆం క్షలు పెట్టారు. అయినా ఇంతభారీగా జనం రావడమేం టి?’ అనేది ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులకు మింగుడు పడడం లేదు. నిజానికి, గత ఎన్నికల్లో వైసీపీకి ఉహించనివిధంగా క్లీన్‌స్వీ్‌ప విజయాన్ని అం దించిన జిల్లా కర్నూలు. అలాంటి చోటే చంద్రబాబు రోడ్‌షో, బాదుడే బాదుడే సభలకు జనం బ్రహ్మరథం పట్టడం రాజకీయ విశ్లేషకులనూ అబ్బురపరిచింది. రాయలసీమ జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజం, నూతనోత్సాహం నింపింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో చంద్రబాబు కర్నూలు జిల్లాలో 3 రోజులు పర్యటించారు. అంతకుముందు నందిగామ, నరసరావుపేట పర్యటనల తరువాత జరిగిన కర్నూలు జిల్లా పర్యటన సూపర్‌ సక్సెస్‌ కావడం టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపితే..అధికార పార్టీ నాయకులను ఆలోచనలో పడేసింది.

ఈ నెల 16న మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకున్నారు. 18న సాయంత్రం 5.06 గంటల సమయానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ మూడు రోజులు పాణ్యం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాల్లో 32 గ్రామాలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ మున్సిపాలిటీల్లో చంద్రబాబు పర్యటన జరిగింది. నియోజకవర్గ కేంద్రాలు సహా వివిధ గ్రామాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, పత్తికొండ, ఎమ్మిగనూరులో బాదుడే బాదుడు సభల్లో పాల్గొన్నారు. టీడీపీ ఆఫీసు ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో చంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమాలకు జనం పోటెత్తారు. అయితే.. వీరిలో ఏఏ సామాజిక వర్గాలవారు ఉన్నారు.. బాబును చూసేందుకు వెళ్లారా.. ? ప్రభుత్వ వ్యతిరేకతతో వెళ్లారా..? స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకతతో వెళ్లారా..? ఇలా వివిధ కోణాల్లో నిఘా వర్గాలు ఓర్వకల్లు నుంచి ఎమ్మిగనూరు వరకు చంద్రబాబు పర్యటన సాగిన గ్రామాలకు వెళ్లి ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పోటీ సభకు ప్లాన్‌

చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ కావడంతో వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బాబు రోడ్‌షో, బాదుడే బాదుడు సభలకు దీటుగా ‘ఏపీ వికేంద్రీకరణ’ పేరుతో మూడు రాజధానులకు సంఘీభావంగా ఈ నెల 25న భారీగా జన సమీకరణ జరిపి సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏఏ నియోజకవర్గాల నుంచి ఎంత మందిని ఈ సభకు తీసుకురావాలో టార్గెట్‌ కూ డా ఇచ్చారని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పేర్కొనడం కొసమెరుపు. దీనికోసం లక్ష జనాభాను సమీకరించాలని తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాల వచ్చాయని తెలుస్తోంది.

Updated Date - 2022-11-23T02:18:11+05:30 IST