Fire: అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
ABN, Publish Date - Dec 31 , 2023 | 08:16 AM
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని హ్యాండ్ గ్లోవ్స్ తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 2:15 గంటలకు మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ తెలిపింది.
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని హ్యాండ్ గ్లోవ్స్ తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 2:15 గంటలకు మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. “మాకు తెల్లవారుజామున 2:15 గంటలకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. లోపల ఆరుగురు చిక్కుకున్నట్లు స్థానికులు సమాచారం అందించారు. మా అధికారులు లోపలికి ప్రవేశించి ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పుతున్నాం” అని అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు. చనిపోయిన కార్మికులంతా మంటలు చెలరేగే సమయంలో ఫ్యాక్టరీలో నిద్రిస్తున్నారు. ‘‘మంటలు చెలరేగినప్పుడు 10-15 మంది కార్మికులు ఫ్యాక్టరీ భవనంలో నిద్రిస్తున్నారు. కొందరు తప్పించుకోగలిగారు. కానీ కనీసం ఆరుగురు లోపల చిక్కుకున్నారు” అని ఓ కార్మికుడు తెలిపారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
Updated Date - Dec 31 , 2023 | 08:18 AM